Begin typing your search above and press return to search.

గల్ఫ్‌ దేశాల్లో తెలుగు వారు కష్టాలు ..అన్నం కోసం అగచాట్లు !

By:  Tupaki Desk   |   1 Aug 2020 9:10 AM GMT
గల్ఫ్‌ దేశాల్లో తెలుగు వారు కష్టాలు ..అన్నం కోసం అగచాట్లు !
X
జీవనోపాధికోసం ఇతర దేశాలకు వెళ్ళిన తెలుగువారి కష్టాలు రోజురోజుకు మరింత అద్వానంగా తయారౌతున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలు లాక్ ‌డౌన్‌ బాటపట్టాయి. ఇందులో భాగంగా కువైట్‌ దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలతో లాక్‌ డౌన్‌ ను అమల్లోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా రాష్ట్రానికి చెందినవారు ఎక్కువ సంఖ్యలో వైరస్‌ బారిన పడుతుండటంతో ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. దీంతో గతనాలుగు నెలలుగా రోజువారి కూలి పనులు, బేల్దారి పనులు, రాడ్‌ బెండింగ్‌, ఇతర పనులు చేసుకుని జీవించేవారి జీవనం కష్టతరంగా మారింది. ఉన్న రూములకు అద్దెచెల్లించలేక, తిండిలేక డబ్బులులేక నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రస్తుతం అన్నంకోసం హాహాకారాలు చేస్తున్నారు. ఎప్పుడు అన్నం, ఆహారపదా ర్థాలు అందిస్తారోనని తెలుగువారు వేలసంఖ్యలో ఎదురు చూస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని నిజామాబాద్‌, కామారెడ్డి, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల వాసులు ఐదు నెలలుగా జీతాలు లేక కువైట్‌లో కష్టాలు పడుతున్నారు . పట్టెడన్నంకోసం తెలుగువారు ఎన్నికష్టాలు పడుతున్నారు. కడప జిల్లాలోని రాజంపేట, నందలూరు, రాయచోటి, పుల్లం పేట, రైల్వేకోడూరు, సుండుపల్లె, చిట్వేలి, పెనగలూరు, ఓబులవారిపల్లి, కడప, బద్వేల్‌, తదితర ప్రాంతాలకు చెందిన తెలుగువారు అనేక అవస్థలుపడుతున్నారు. వీరంతా లాక్‌ డౌన్‌ కారణంగా అక్కడ తిండీ తిప్పలకు నానా తంటాలు పడుతున్నారు. వీరందరి కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రాంత పాలకులపై ఉందని తమ కష్టాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళాలని వేడుకుంటున్నారు. భారత్‌ కు రప్పించాలని సెల్పీ వీడియోలు ద్వారా వేడుకుంటున్నారు. అక్కడ కంపెనీలు పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వదేశానికి రప్పించాలని వేడుకుంటున్నారు.