గడిచిన కొన్ని దశాబ్దాలుగా అమెరికా భారత్ మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. ఆర్థిక.. వాణిజ్య పరమైన అంశాలతోపాటు అమెరికా భారత్ మధ్య మైత్రీ బంధం నెలకొంటూ వస్తోంది. ఈ క్రమంలోనే కోట్లాది మంది భారతీయులు అమెరికాలో ప్రవాస భారతీయులుగా స్థిరపడ్డారు. ఆ దేశ అభివృద్ధిలో భారతీయులు కొంతకాలంగా కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రవాస భారతీయులు అమెరికాలో చాలా కీలకమైన హోదాల్లో నియామక అవుతున్నారు. అమెరికన్ బడా కంపెనీలకు సీఈవోలుగా.. బ్యాంకులకు అధిపతులుగానూ.. రాజకీయాల్లో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో... గవర్నర్లు వంటి కీలక పదవుల్లో కొలువు దీరుతూ సత్తా చాటుతున్నారు.
అమెరికాలో సెటిల్ అవుతున్న భారతీయుల్లో ఎక్కువగా మన తెలుగు వాళ్లు ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే అమెరికాలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగి పోతోంది. అమెరికాలో ఆసియన్ దేశాలను ఆధిపత్యాన్ని సైతం తెలుగు భాష వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచిందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడి కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గత పదేళ్లలో అమెరికాలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న భాషలపై పలువురు పరిశోధనలు చెప్పారు. వీరి అంచనా ప్రకారంగా తెలుగు 150 శాతం మేర.. అరబిక్ 61 శాతం.. ఉర్దూ 45 శాతం.. చైనీస్ 35 శాతం.. గుజరాతి 31 శాతం మేర అభివృద్ధి చెందాయి. తెలుగు మాట్లాడే జాబితాలో మిస్ యూఎస్ నీనా దావులూరి.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సైతం ఉన్నారు
అమెరికాలో ఆసియన్ దేశాల ఆధిప్యతం ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం తెలుగు భాష ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం చూస్తుంటే మన భాష అక్కడి వారికి ఎంతలా కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. గత పదేళ్లలో 150శాతం మేర పెరుగుదలను తెలుగు భాష సాధించిందంటే అమెరికన్లు మన భాషను ఎంతలా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
అమెరికాలో ఐటీ ఉద్యోగాల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. 1980, 1990 లో అమెరికాలో ఏర్పడిన ఐటీ బూమ్ కారణంగా భారతీయులు అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. నాటి నుంచి అమెరికన్ కంపెనీలన్నీ కూడా భారతీయ ఐటీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తోంది. వీరిలో ఎక్కువగా మన తెలుగు వాళ్లే ఉంటూ వస్తున్నారు. అమెరికాలోని తెలుగు వారంతా మన సంస్కృతికి సాంప్రదాలయాలకే పెద్దపీట వేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అమెరికాలోని కొన్ని రాష్ట్రాలన్నీ ఏకంగా మన నెటీవీటీకి తగ్గట్టుగా మారిపోతున్నాయి. దీంతో అమెరికన్లు సైతం మన తెలుగు భాషను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక తెలుగు పాటుగా ఆర్థికంగా.. రాజకీయంగా బలంగా ఉన్న రాష్ట్రాలకు చెందిన ప్రజల భాషలు సైతం అమెరికాలో క్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.