Begin typing your search above and press return to search.

పత్రికాధిపతి కుమారుడి కి లివర్ ట్రాన్సప్లంటేషన్ ?

By:  Tupaki Desk   |   13 May 2020 4:30 PM GMT
పత్రికాధిపతి కుమారుడి కి లివర్ ట్రాన్సప్లంటేషన్ ?
X
కరోనా ధాటికి పేద, ధనిక అందరూ ఇంట్లోనే బందీ అయిపోయిన విపత్కర పరిస్థితి. కరోనా వ్యాపిస్తుందని ప్రైవేటు ఆస్పత్రులన్నీ మూసేశారు. కోట్లు సంపాదించే డాక్టర్లు కూడా కరోనా భయానికి గమ్మున కూర్చుకున్నారు. కేవలం ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రమే ఈ విపత్తు వేళ నడుస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు, వైద్యులు కరోనా భయానికి దుకాణం బంద్ చేసేశారు. చికిత్సలు చేయడం లేదు. ఈ పరిణామం.. ఇతర రోగాలు ప్రబలిన వారికి ప్రాణసంకటంగా మారింది.

అసలే కరోనా... ఎక్కడికక్కడ లాక్ డౌన్. కాలు బయట పెట్టేందుకు అవకాశం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలుగు పత్రికా రంగంలో ఓ పెద్ద మీడియా హౌస్ కు ఓనర్ గా ఉన్న ప్రముఖుడి కుమారుడి లివర్ పాడైందని సమాచారం. తమ మీడియా హౌస్ వ్యవహారాల్లో తండ్రితోపాటు కీలక భూమిక పోషిస్తున్న సదరు యువకుడు నిత్యం ఆఫీసు కార్యకలాపాల్లో చాలా చురుగ్గానే వ్యవహరిస్తున్నారు. అయితే లివర్ పాడైన కారణంగా ఇటీవలి కాలంలో ఆయన తన కార్యాలయానికే రావడం లేదట. ఈ విషయాన్ని పత్రికాధిపతి కుటుంబం చాలా గోప్యంగా ఉంచినా... యమా యాక్టివ్ గా ఉండే తమ చిన్న బాస్ ఆఫీసు పరిసరాల్లోనే కనిపించకపోవడంతో సిబ్బంది ఆరా తీయగా అసలు విషయం బయటపడిందట.

లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయకపోతే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు తెలిపారట.. అందుకే ఇప్పుడు ఇంతటి కరోనా టైంలో ఆస్పత్రులన్నీ బంద్ అయిన వేళ చికిత్స కోసం సదురు మీడియా బాస్ నానా ఇక్కట్లు పడుతున్నారట.. పత్రికా రంగంలో తనదైన శైలిలో దూసుకెళ్లిన ఈ మీడియా హౌస్ అధినేత బాగానే సంపాదించారట. ఈ క్రమంలోనే లివర్ ట్రాన్స్ ప్లాంట్ తప్పనిసరి అయిన తన కుమారుడిని విదేశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించాలని భావించారట. అయితే కరోనా కారణంగా దాదాపుగా అన్ని దేశాల్లో లాక్ డౌన్ అమలు అవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే విదేశాలకు వెళ్లడంపై ఆశలు వదిలేసిన సదరు మీడియా అధిపతి... దేశంలోనే లివర్ ట్రాన్స్ ప్లాంట్ కు ఎక్కడ మెరుగైన చికిత్స లభిస్తుందన్న వివరాలపై ఆరా తీశారట.

ఈ క్రమంలో మహారాష్ట్ర రాజధాని ముంబైలో అయితే మెరుగైన లివర్ ట్రాన్స్ ప్లాంట్ చికిత్సలు లభిస్తాయన్న విషయాన్ని తెలుసుకుని తన కుమారుడిని ఆ మీడియా అధిపతి ముంబైకే తరలించారట. ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రముఖ వైద్యశాలలో తన కుమారుడికి ఆ మీడియా అధిపతి లివర్ ట్రాన్స్ ప్లాంట్ చికిత్సలు అందిస్తున్నారట. సాధారణంగా సంపన్నుల ఇళ్లలో ఖరీదైన రోగాలు వచ్చాయంటే.. చికిత్సకు ఫారిన్ ట్రీట్ మెంట్లనే ఆశ్రయిస్తారు. కానీ కరోనా కారణంగా తన కుమారుడికి ఫారిన్ చికిత్సలకు బదులుగా దేశీయ చికిత్సలతోనే ఆ మీడియా అధిపతి సరిపెట్టేస్తున్నారట. కరోనా ధాటికి ఇప్పుడు రాజు, పేద అందరూ సమానమేనంటే ఇదేనేమో..