Begin typing your search above and press return to search.
అమెరికాలో విషాదం.. తెలుగు వ్యక్తి దుర్మరణం
By: Tupaki Desk | 2 Oct 2020 2:00 PM GMTఅమెరికాలో మరో విషాదం నెలకొంది. తెలుగు వ్యక్తి తన కూతురు పుట్టినరోజునాడే చనిపోవడం అందరినీ కలిచివేసింది. అనంతపురం జిల్లాకు చెందిన మసూద్ అలీ న్యూజెర్సీలోని ప్లేయిన్స్ బోరోలో భార్య అయేషా, కుమార్తె అర్షియాతో జీవిస్తున్నాడు.
గురవారం కుమార్తె అర్షియా పుట్టినరోజు కావడంతో రాత్రికి ఏర్పాట్లు చేశారు. తన అపార్ట్ మెంట్ నుంచి బయటకు వెళుతుండగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు.
వెంటనే గుర్తించిన స్థానికులు మసూద్ ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
హెచ్1 వీసా కలిగిన మసూద్ అలీ.. ఇటీవల తన భార్య, కూతురును ఇండియా నుంచి అమెరికాకు తీసుకొచ్చాడు. కరోనా భయంతో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. కానీ ఇంతలోనే విషాదం అలుముకుంది.
ఇక మసూద్ అలీ మరణంతో భార్య అయేషా ఒంటరైంది. ఆమెకు అమెరికాలో స్నేహితులు, బంధువులు కూడా లేరు. పొరుగువారితో కూడా పరిచయం లేదు. మసూద్ కుటుంబం సహాయం కోసం నాట్స్ హెల్ప్ లైన్ ను సంప్రదించింది. నాట్స్ బృందం వారి ఇంటికి వెళ్లి వారికి అవసరమైన సహాయం అందిస్తున్నారు. మసూద్ డెడ్ బాడీని స్వదేశానికి తరలించడానికి నాట్స్ ఏర్పాట్లు చేస్తోంది. మసూద్ కుటుంబానికి భారతీయులు అండగా నిలువాలని పలువురు కోరుతున్నారు.