Begin typing your search above and press return to search.
తాగిన భర్తది ఒప్పంటూ పోలీసులతో ఫైట్
By: Tupaki Desk | 19 Sep 2018 6:10 AM GMTసతీ సావిత్రి... భర్త ప్రాణాల కోసం పోరాడిన అభ్యుదయ మహిళ..అలాంటి మహిళలు పుట్టిన దేశం మనిది. కానీ ఇక్కడ మాత్రం ఓ మహిళ భర్తకు తాగిచ్చి మరీ పోలీసులతో పోరాడింది...ఒక్క బీరు తాగితే పట్టుకుంటారా అని శివాలెత్తింది. భర్తకు సపోర్టుగా పోలీసులపై శివంగిలా దుముకింది. వారితో ఫైట్ చేసింది. ఏపీ పోలీసును షేక్ చేసిన ఈ ఆధునిక మహిళ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ కాలంలో బీరు తాగడం కామన్.. నీళ్లు తాగినట్టే తాగేస్తున్నారు. ఆడవాళ్లు సైతం ఇష్టంగా కొట్టేస్తున్నారు. అందుకే ఈ మహిళ కూడా తన భర్తకు ఓ బీరు తాగించింది. పార్టీయో.. పబ్బో కానీ భర్తకు తనే దగ్గరుండి మరీ ఇప్పించిదట.. భర్త తాగాడు. అనంతరం ఇద్దరూ కలిసి వాహనంపై బయలు దేరారు. తాగి రోడ్డెక్కితే పోలీసోళ్లు ఊరుకుంటారా...? డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుకున్నారు. అప్పుడు మొదలైంది కథ..
మహిళా శివాలెత్తింది. ‘నా మొగుడికి నేను తాగిస్తే మీకేంటి నొప్పి.. ఒక్క బీరుకే పట్టుకుంటారా.? మహిళనైనే నేనే తాగిస్తే మీరెందుకు తప్పుపడుతారు. ఒక్క బీరుకే కేసు పెడతారా..? అసలు తాగకుండా వైన్ షాప్ లు బంద్ చేయండి’ అంటూ మహిళా వీరావేశంతో రెచ్చిపోయింది.. ట్రాఫిక్ పోలీసులపై మహిళా దాడికి దిగడం.. పోలీసులు మహిళా అని చూడకుండా ఎదురుదాడి చేయడంతో రచ్చ రచ్చ అయిపోయింది. ఈ దాడిలో మహిళా బూతులు తిట్టింది. పోలీసులు ఆమెపై చేయిచేసుకున్నారు..
ఇలా ఈ మహిళ చేసిన పని వైరల్ అయ్యింది. మగవాళ్లంతా ఈ వీడియోను తెగ షేర్లు చేస్తున్నారు. ఇన్నాళ్లు భర్త తాగితే కొట్టే భార్యలను చూశాం కానీ.. ఇలా భర్తకు తాగించి ప్రశ్నించిన వారిని కొడుతున్న భార్యను మొదటి సారి చూశామని మందుబాబులు తెగ వైరల్ చేస్తున్నారు. తమ భార్యలు ఈమెలా బీరు తాగిచ్చి మరీ అడ్డువచ్చిన వాళ్లను కొడితే ఎంత బావుండో అని మురిసిపోతున్నారు. కానీ అన్నీ బీర్లు ఒకలా ఉండవు.. అలానే అందరూ భార్యలు పైన భర్తను వెనకేసుకొచ్చిన భార్యలా ఉండరు.. అది గుర్తించాలి మగరాయుళ్లంతా..? ఎంతైనా ఆ మొగుడు అదృష్టవంతుడంటూ ఇప్పుడు మగరాయుళ్లంతా తెగ కుమిలిపోతున్నారట..