Begin typing your search above and press return to search.

సెల్ఫీ తీసుకుంటూ అమెరికాలో తెలుగ‌మ్మాయి దుర్మరణం

By:  Tupaki Desk   |   14 Sep 2020 7:00 AM GMT
సెల్ఫీ తీసుకుంటూ అమెరికాలో తెలుగ‌మ్మాయి దుర్మరణం
X
ఎన్నో కలలలో , మరెన్నో ఆశయాలతో అమెరికాకి వెళ్లిన తెలుగు యువతి , అక్కడ ఎంఎస్ పూర్తి చేసి , మంచి ఉద్యోగం చేస్తున్న సమయంలో అనుకోని జలపాతంలో ప్రమాదవశాత్తు కన్నుమూసింది. దీనితో కృష్ణా జిల్లా , గుడ్లవల్లేరులో విషాదం నెలకొన్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే .. కృష్ణా జిల్లాకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దపంతులకు ఇద్దరు కూతుళ్లు. రెండో కూతరు కమల.. ఇక్కడే ఇంజనీరింగ్ పూర్తిచేసి పైచదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన ఆమె, ప్రస్తుతం కొలంబియాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం కమల వారి బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చే మార్గంలో కమల, అట్లాంటాలోని ఓ జలపాతం వద్ద ప్రమాదవశాత్తు మరణించింది. జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఆమె జలపాతంలో పడి, ప్రాణాలు కోల్పోయింది. జలపాతం దగ్గర సహాయక సిబ్బంది డెడ్‌ బాడీని బయటకు తీశారు. కమల మరణ వార్తను కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. దీనితో కూతురి మరణంతో తల్లిదండ్రులు , కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆమె మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకొచ్చేందుకు సహకరించాలని పేరెంట్స్ కోరుతున్నారు. నాట్స్‌ సహకారంతో మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.