Begin typing your search above and press return to search.
‘స్పేస్ ఎక్స్’ మిషన్ హెడ్ గా తెలుగమ్మాయి ... పదిభాషల్లో ప్రావీణ్యం !
By: Tupaki Desk | 7 Dec 2020 5:39 AM GMTసీత .. ప్రఖ్యాత 'స్పేస్ ఎక్స్’ మిషన్ హెడ్. ఎనిమిది దేశాల్లో అమెరికన్ ఎంబసీల్లో కొలువు.. కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు... కర్ణాటక సంగీత కచేరీలు... 22 ఏళ్ళకే ఇరాక్ యుద్ధ బంకర్లలో పని.. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. ఆమె తెలుగు మహిళ. కోనసీమవాసి. అమెరికాలోని చికాగో లో ఉంటున్న సీత తల్లిదండ్రులు ఆమె గురించి కొన్ని విషయాలని వెల్లడించారు. ఆ విషయాలని ఇప్పుడు చూద్దాం...
మా అమ్మాయి అమెరికాలోనే పుట్టినా భారతీయ సంప్రదాయాన్ని విడిచి పెట్టలేదు. పదహారు సంవత్సరాలు వచ్చేవరకు పూర్తి తెలుగుదనంతోనే పెంచాను. కాలేజీలలో చేరాక వారి దారిని వారు ఎంచుకున్నా కూడా తెలుగుని విడవలేదు’ అంటారు సీత తల్లి శారదాపూర్ణ శొంఠి. అమెరికాలోని ప్రఖ్యాత ఆమె హెస్ట్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్ కి చేరడానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇక్కడ చేరాలనుకుంటున్నావు అని సీతను ప్రశ్నించారు. మా అమ్మనాన్నలు నన్ను డాక్టర్ లేదా ఇంజనీర్ చదివించాలనుకుంటున్నారు. నాకు ఏదైనా విభిన్నంగా చేయాలని ఉంది. అందువల్ల డిఫరెంట్ ఫీల్డ్ ఏదో మీరే సజెస్ట్ చేయండి. ఏదైనా కొత్తగా సాధించాలనుకుంటున్నాను అని సీత చెప్పిన సమాధానం అధ్యాపకులను ఆకట్టుకుంది. ఆమెకు ఆ కాలేజీలో ప్రవేశం లభించింది. పొలిటికల్ ఎకనామిక్స్ లో అండర్ గ్రాడ్యుయేషన్ చేశాక స్టేట్ డిపార్ట్ మెంట్ లో పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆమె ఆసక్తిని తెలుసుకున్న ప్రొఫెసర్ ‘మిడిల్ ఈస్ట్‌లో రాజకీయాలనూ అక్కడి పరిస్థితులను అధ్యయనం చెయ్. అధ్యయనం తేలికగా ఉండడానికి అరబిక్ నేర్చుకోమని సలహా ఇచ్చారు. వారి సూచన మేరకు సీత తెలుగు, హిందీ, ఫ్రెంచ్, అరబిక్ మొత్తం పది భాషలు నేర్చుకున్నారు.
స్కూల్ ఫర్ అడ్వాన్స్‌డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక స్టేట్ డిపార్ట్ మెంట్ లో చేరారు. ఆ డిపార్ట్ మెంట్ లో ఎంపికైన మొట్టమొదటి తెలుగమ్మాయి సీత. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో గ్రీన్ జోన్ లో అంటే కంటోన్మెంట్ ఏరియాలో సైనికులతో పాటు బంకర్ల దగ్గర పని చేశారు సీత. అమెరికా–ఇరాక్ యుద్ధ సమయంలో యుద్ధంలో మరణించిన 150 మందికి మణికట్టుకి బ్యాండ్ కట్టి, వారి వివరాలను అమెరికాకు తెలియచేశారు సీత. సీత అన్ని రకాల యుద్ధ విద్యలతోపాటు ఏకే 47 కాల్చడంలో కూడా శిక్షణ పొందారు. సీతకు ఇద్దరు పిల్లలు. జయరామ్, ఆనంద. పిల్లల్ని చూసుకుంటూ ఆమె వృత్తిలో పురోగతి సాధిస్తున్నారు. ఆమెకు వంట కూడా బాగా వచ్చు. ఏ పదార్థాన్ని ఎంత, ఎలా తినాలి అనే విషయంలో అమితమైన శ్రద్ధ. పిల్లలకూ తానే వండి పెడతారు. ప్రతి ఆదివారం దేవాలయానికి తీసుకువెడతారు. పిల్లలు తెలుగు బాగా మాట్లాడతారు అని అన్నారు.
సీత ఒకసారి మానస్ సరోవర్ కి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ళ బృందంలో ఉన్న 70 సంవత్సరాల పెద్దాయన అక్కడ అకస్మాత్తుగా కన్ను మూశారు. వెంటనే సీత ఆయన భౌతిక కాయాన్ని కిందకు తీసుకువచ్చి, దహనక్రియలు పూర్తిచేసి మళ్లీ మానస్ సరోవర్, కైలాస్ గిరి దర్శించుకున్నారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు తల్లిదండ్రుల కోసమని ఒక గ్యాలన్ నీళ్లు తీసుకువచ్చారు. చికాగోలో గాంధీ విగ్రహం ప్రతిష్ఠించినప్పుడు ఈ నీటితోనే అభిషేకించారని చెప్పారు. సీత, సోదరితో కలిసి ఉమా రామారావుగారి వద్ద నాట్యం, నేదునూరి కృష్ణమూర్తిగారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు.