Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేకు నిర్మాత‌ల‌ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

By:  Tupaki Desk   |   10 Jan 2022 5:33 PM GMT
వైసీపీ ఎమ్మెల్యేకు నిర్మాత‌ల‌ స్ట్రాంగ్ కౌంట‌ర్‌
X
లుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌ని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సోమ‌వారం నియోజ‌క వ‌ర్గంలోని ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలకు ప్రారంభోత్స‌వం చేసిన కోవూరు ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి టాలీవుడ్ నిర్మాత‌ల‌ పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. సినిమా వాళ్లు హైద‌రాబాద్ లో వున్నార‌ని, వారికి ఏపీ క‌నిపిస్తుందా? అని ప్ర‌శ్నించారు. అంతే కాకుండా నిర్మాత‌లు బ‌లిసి కొట్టుకుంటున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అయితే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ వ్యాఖ్య‌ల‌పై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు స‌గ‌టు సినీ ప్రియులు మండిప‌డుతున్నారు. నోటికి ఎంతొస్తే అంత ఎలా మాట్లాడ‌తార‌ని నెట్టింట కామెంట్ లు చేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్య‌ల‌కు ధీటుగా కొంత మంది సినీ అభిమానులు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న‌పై విరుచుకుప‌డుతున్నారు. ఇదిలా వుంటే గ‌తంలోనూ త‌న పాపులారిటీని పెంచుకోవ‌డం కోసం న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ ఐఏఎస్ ల‌పై ఇలాంటి వ్యాఖ్య‌లే చేసి విమ‌ర్శ‌ల పాల‌య్యార‌ని దుయ్య‌బ‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డికి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. కోవూరు ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ నిర్మాత‌ల‌ని ఉద్దేశించి మాట్లాడుతూ ` బ‌లిసిన వాళ్లు` అని అన‌డం జ‌రిగింది. ఇది చాలా బాధాక‌రం. నిజా నిజాలు తెలియ‌కుండా ఒక గౌర‌వ శాస‌న స‌భ్యులు ఈ విధంగా మాట్లాడ‌టం మొత్తం తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌ను అవ‌మానించిన‌ట్టుగా వుందని భావిస్తున్నాము.

మ‌న తెలుగు సినిమా స‌క్సెస్ రేటు సుమారుగా 2 నుండి 5 వాతం మాత్ర‌మే. మిగిలిన సినిమాలు న‌ష్ట‌పోవ‌డం జ‌రుగుతుంది. చిత్ర సీమ‌లో ఉన్న 24 క్రాఫ్ట్స్ కు ప‌ని క‌ల్పిస్తూ అనేక ఇబ్బందులు ప‌డి కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి సినిమాలు తీసిన నిర్మాత‌లు చివ‌రికి ఆస్తులు అమ్ముకోవ‌డం జ‌రుగుతోంది. ఈ క‌ష్ట న‌ష్టాల బారిన ప‌డి కొంత మంది నిర్మాత‌లు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి నుండి నెల‌కు 3000/- రూపాయ‌ల‌పెన్ష‌న్ తీసుకుంటున్నారన్నారు.

దీనిని బ‌ట్టి చ‌ల‌న చిత్ర నిర్మాత‌లు ఎటువంటి దారుణ ప‌రిస్థితుల‌లో ఉన్నార‌న్న సంగ‌తి తేట‌తెల్ల‌మ‌వుతోంది. గౌన‌వ శాస‌న స‌భ్యులు శ్రీ న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి గారు నిర్మాత‌ల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లను తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి తీవ్రంగా ఖండిస్టోంద‌ని తెలియ‌జూస్తూ వారు ఈ వ్యాఖ్య‌ల‌ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోరుకుంటున్నాము` అంటూ చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి వైసీపీ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇవ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సోమ‌వారం ఈ వ్యాఖ్య‌ల్ని ఖండిస్తూ గ‌మ‌నించిన చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి కార్య‌ద‌ర్శులు మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల‌, టి. ప్ర‌స‌న్న‌కుమార్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.