Begin typing your search above and press return to search.
టీడీపీ మ్యానిఫేస్టో... నమ్మబుల్ గా ఉంటుందా...?
By: Tupaki Desk | 23 May 2023 9:02 PM GMTతెలుగుదేశం వచ్చే ఎన్నికల కోసం సిద్ధం అవుతోంది. ఎన్నికలకు పది నెలల సమయం ఉండగానే మ్యానిఫేస్టోను తయారు చేసే పనిలో ఉంది. రెండు విడతలుగా దాన్ని విడుదల చేయాలని అనుకుంటోంది. ఈ నెల 27, 28 తేదీలలో రాజమండ్రీలో జరిగే మహానాడులో ఎన్నికల ప్రణాళికలో కొంత భాగాన్ని రిలీజ్ చేసి రుచి చూపించాలని టీడీపీ కసరత్తు చేస్తోంది.
ఎన్నికల ప్రణాళికలో భాగంగా యువత, రైతులు, మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి మ్యానిఫేస్టోను ఈ ఏడాది విజయదశమికి రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. మ్యానిఫేస్టోలో సంక్షేమ పధకాలకు పెద్ద పీట చేస్తారని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పధకాలను తాము కొనసాగిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే 2014లో టీడీపీ మ్యానిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది.
రైతు రుణాలను మొత్తం మాఫీ చేస్తామని చెప్పిన తెలుగుదేశం ఆనాటికి ఉన్న 87 వేల కోట్ల రూపాయల రుణాలను అయిదేళ్ల పాలనలో మాఫీ చేయలేదు. కేవలం పాతిక కోట్ల దాకా మాత్రమే మాఫీ చేసింది. అలాగే డ్వాక్రా మహిళల రుణాలను మొత్తం మాఫీ చేస్తామని అది కూడా చేయలేదని వైసీపీ నేతలు ఈ రోజుకీ విమర్శిస్తూంటారు.
హామీలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే దాన్ని అమలు చేయడం మరో ఎత్తు. తెలుగుదేశం పార్టీ హామీలు నెరవేరుస్తుందా లేదా అన్నది ఒక చర్చగా ఉంది. అదే టైం లో టీడీపీ ఉచితాల మీద గత మూడేళ్ళుగా విమర్శలు చేసింది. అప్పులు చేసి వైసీపీ దోచిపెడుతోందని, పధకాలను పప్పు బెల్లాలుగా పంచిపెడుతున్నారని కూడా చంద్రబాబు మొదలుకుని మొత్తం టీడీపీ నేతలు విమర్శలు చేస్తూ వచ్చారు.
అయితే సర్వేలు కొన్ని సంక్షేమ పధకాల ప్రభావం చాలా ఉంది అని చెప్పడంతో టీడీపీ పధకాల విషయంలో మాట మార్చిందని అంటున్నారు పథకాలను తామూ కంటిన్యూ చేయస్తామని నాటి నుంచే మొదలెట్టింది. అయితే దీని మీద కూడా వైసీపీ నేతల నుంచి సెటైర్లు పడుతున్నాయి.
జగన్ సంక్షేమ పధకాలు అమలు చేస్తామని చెబితే మీరు ఎందుకు. జగన్నే జనాలు మరోసారి ఎన్నుకుంటారు కదా అంటూ కౌంటర్ చేస్తున్నారు. ఇది కూడా లాజిక్ గానే ఉంది మరి. మాకు ఓటేయండి జగన్ పధకాలే మేమూ ఇస్తామంటే జనాలు ఎంతవరకూ టర్న్ అవుతారు అన్నది చూడాలి. అలాగే ఆయా ప్రభుత్వాలు పార్టీల ట్రాక్ రికార్డు కూడా ఇక్కడ కీలకమైన పాత్ర పోషిస్తుంది.
ఏది ఏమైనా ఈసారి టీడీపీ మ్యానిఏస్టోలో మాత్రం హామీల మీద హామీలు ఉంటాయనే అంటున్నారు. నిజానికి చంద్రబాబు తాను సంస్కరణ వాదిని అని చెప్పుకుంటారు. ఆయన మరో వైపు ఉచితాలు ఎలా ఆమోదిస్తారు అన్నది సిద్ధాంతపరమైన వైరుధ్యంగా కనిపిస్తుంది అని అంటున్నారు.
ఎన్నికల మ్యానిఫేస్టోలకు ఏముంది. కర్నాటకలో బీజేపీ కూడా ఉచితంగా అన్నీ ఇస్తామని చెప్పినా తాజా ఎన్నికల్లో ఓడించారు ప్రజలకు పధకాలూ కావాలి. నేతలు అయిదేళ్లూ మాట నిలబెట్టుకోవడం కావాలి. ఆ విషయంలో మాత్రం టీడీపీ నమ్మబుల్ గా వ్యవహరిస్తేనే మ్యానిఫేస్టో సక్సెస్ అవుతుంది అని అంటున్నారు. విజయదశమి వేళ అంతా విజయం అవుతుందనుకుని మ్యానిఫేస్టోని రిలీజ్ చేస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.