Begin typing your search above and press return to search.

దేశం లో విబేధాలు...

By:  Tupaki Desk   |   28 Aug 2018 11:49 AM GMT
దేశం లో విబేధాలు...
X
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలో విబేధాలు తారాస్థాయికి చేరాయి. నాయకుల మధ్య అస్సలు సమన్వయం కుదరటం లేదు. పార్టీలో సీనియర్ నాయకులు కూడా ఒకరి మీద ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నిక‌ల‌లో తెలుగుదేశం జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ తో చేతులు కలపడం పార్టీలో మిగతా నాయకులుకు అస్సలు మింగుడుపడడం లేదు. అంతేకాకుండ వైఎస్‌ఆర్‌ పార్టీ నుంచి వలస వచ్చిన నాయకులతో తెలుగుదేశం పార్టీలోని నాయకులకు అస్సలు పొత్తు కుదరటం లేదు. తొలి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి రెడ్డి కులస్థుల అండదండలున్నాయి. రాజకీయంగా రెడ్డి కులస్థులు నానాటికి ఎదిగిపోవడాన్ని తమను పట్టించుకోక పోవడంతో కమ్మ కులస్తులంగరూ తెలుగుదేశం పార్టీని తమదిగా భావించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో చేతులు కలపడంతో ఆ కులస్తులందరూ ఆయనను వ్యతిరేకిస్తున్నారు.1983 వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీపై కోపంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి చెందని వారే ఎక్కువ. ఇప్పుడు తెలుగదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి నేటి వరకూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే పనిచేసింది. హఠాత్తుగా చంద్రబాబు నాయుడు తన అధికారం కోసం ఆగర్భ శత్రువుగా భావించే కాంగ్రెస్‌ తో కలవడాన్ని ఆ సమాజిక వర్గం జీర్ణించుకోలేక పోతోంది.

తెలుగుదేశం పార్టీలో కుల వివాదం ఇలా ఉంటే తమ్ముళ్ల మధ్య పొరపొచ్చాలు మరోవిధంగా పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. వేరే పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశం తీర్ధం పుచ్చుకుంటున్న వారిని తెలుగు తమ్ముళ్లు అంగీకరించటం లేదు. శ్రీకాకుళం జిల్లాలో రాజం నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కొండ్రు మురళి మోహన్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అయితే ఆయన చేరికను తెలుగుదేశం పార్టీ సినీయర్ నాయకురాలు ప్రతిభ భారతి ససేమీర అంటున్నారు. ఇదీ చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. విజయనగరం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య మనస్పర్దలు నివురుగప్పిన నిప్పుల ఉంది. విశాఖ జిల్లాలో మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస్ మధ్య విబేధాలు ఎప్పుడో రోడ్డేక్కయి. ఇదీ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని వార్తలొస్తున్నాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులకూ - శట్టిబలిజ వర్గానికి చెందిన నాయకులకు పడటం లేదు. దీనికి కారణం కాపురిజర్వేషనే అని అంటున్నారు. విజయవాడ నగరంలో సిట్టింగ్ ఎమ్మల్యేలు జలీల్‌ ఖాన్ - బోండ ఉమల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

గుంటూరు - ప్రకాశం జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. నెల్లురు జిల్లాలో మంత్రి నారయణ ఆదిపత్యాన్ని జిల్లా నాయకులు భరించలేకపోతున్నారు. రాయలసీమ జిల్లాలలోని కూడా ఇదే పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లాలో జేసీ సోదరుల నుంచి చంద్రబాబుకు తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఎంపీ జే.సీ. దివాకర రెడ్డి రోజుకో సంచలన ప్రకటనతో జిల్లా నాయకులను ఇరుకున పెడుతున్నారు. కర్నూలు జిల్లాలో సజావుగా ఉన్న పరిస్థితిని చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ చక్కగా చెడగొట్టారు. ఎన్నికలకు ఏడాదిన్నార ముందుగానే అభ్యర్దులను ప్రకటించి స్థానిక నేతలలో చిచ్చు రగిల్చారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో చిత్తూరులో కూడా తమ్ముళ్ల మధ్య సయోధ్య లేదు. మాజీ మంత్రి గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు భార్య - తనయులు పదవుల కోసం రోడ్డేక్కారు. కడప జిల్లాలో రాజ్యసభ సభ్యుడు సీ.ఎం. రమేష్ చేసిన ఆమరణ దీక్ష తుస్సుమంది. ఈ దీక్షతో జిల్లాలో చెడ్డపేరు వచ్చిందని తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. ఇలా ప్రతీ చోట తెలుగుదేశం పార్టీ అంతర్గత పోరుతో సతమతమవుతోంది.