Begin typing your search above and press return to search.

ఇద్దరిని ఫైనల్ చేసిన టీడీపీ

By:  Tupaki Desk   |   29 July 2022 7:30 AM GMT
ఇద్దరిని ఫైనల్ చేసిన టీడీపీ
X
వచ్చే మార్చి నెలలో జరగబోతున్న మూడు ఎంఎల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఇద్దరు అభ్యర్ధులను ప్రకటించింది. తొందరలోనే మూడో అభ్యర్ధిని కూడా ప్రకటించబోతోంది.

గ్రాడ్యుయేట్స్ కోటాలో భర్తీ చేయాల్సిన మూడు ఎంఎల్సీ స్ధానాలకు మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఒక స్ధానం ఉంటుంది. అలాగే రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలు రెండో నియోజకవర్గం. ఇక ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు మూడో నియోజకవర్గం.

పై మూడు నియోజకవర్గాలకు వైసీపీ తరపున ఇప్పటికే అభ్యర్ధులను జగన్మోహన్ రెడ్డి ప్రకటించేశారు. వాళ్ళు ముగ్గురు ప్రచారంలోకి కూడా దిగిపోయారు. ఆ ఎన్నికల్లో పోటీచేయటానికి టీడీపీ తరపున చంద్రబాబు ఇద్దరిని ప్రకటించారు.

రాయలసీమ జిల్లాల అభ్యర్ధిగా పులివెందులకు చెందిన రాజగోపాలరెడ్డిని ఖరారుచేశారు. అలాగే కోస్తా-చిత్తూరు జిల్లాల నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గానికి చెందిన కంచర్ల శ్రీకాంత్ పోటీ చేయబోతున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాల తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థిని మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు. ఇక్కడి నుండి పోటీ చేయటానికి విశాఖపట్నంకు చెందిన పట్టాభి, సమైక్యాంధ్రలో పనిచేసిన కిషోర్, ఉద్యోగ సంఘాల నేత ఈర్ల శ్రీరామ్మూర్తి పోటీపడుతున్నారు. మరి వీరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమి చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. అలాగే బీజేపీ తీసుకోబోయే నిర్ణయం కూడా ఉత్కంఠగా మారింది. బీజేపీకి నిజానికి బలమేలేదు.

అయితే పోయిన ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో ఉత్తరాంధ్ర జిల్లాల నుండి పీవిఎస్ మాధవ్ గెలిచారు. రెండు పార్టీలకు చెడిన దగ్గర నుండి తమ సొంత బలంతోనే ఎంఎల్సీ స్ధానాన్ని గెలుచుకున్నామని బీజేపీ చెబుతోంది. అదే నిజమైతే మళ్ళీ ఇపుడు పోటీచేసి గెలుచుకోగలదా ? అనేది పాయింట్. ఈ విషయంలో బీజేపీ ఏమి నిర్ణయం తీసుకుంటుందాని అందరు చూస్తునారు. రాబోయే ఈ ఎన్నికల్లో చెప్పుకోవటానికి మూడు స్దానాలే అయినా తొమ్మిది జిల్లాల ఓటర్లను ఆలోచనను ప్రతిఫలిస్తుంది.