Begin typing your search above and press return to search.

గైడ్ చ‌దివి పాస్ కావాల‌నుకోవ‌ద్దు లోకేష్.. త‌మ్ముడూ...!

By:  Tupaki Desk   |   7 Dec 2020 11:30 AM GMT
గైడ్ చ‌దివి పాస్ కావాల‌నుకోవ‌ద్దు లోకేష్.. త‌మ్ముడూ...!
X
టీడీపీ యువ నాయ‌కుడు, భావి ముఖ్య‌మంత్రిగా ఆ పార్టీ నేత‌లు భావిస్తున్న‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు.. ఎమ్మెల్సీ లోకేష్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా చిల‌క ప‌లుకులు ప‌లుకుతున్నారు. సీఎం జ‌గ‌న్‌ పైనా, ఆయ‌న స‌ర్కారు పైనా, ఎంపీల‌పై వ్యాఖ్య ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే.. ఇది మాత్ర‌మే స‌రిపోతుందా? కేవ‌లం ట్విట్ట‌ర్‌ను న‌మ్ముకుంటే .. ప్రజ‌లు ఓట్లు కురిపించేస్తారా? అస‌లు ట్విట్ట‌ర్‌ను ఫాలో అవుతున్న‌వారిలో ఎంత మంది ఓట్లు వేస్తున్నారు? అంటే.. ప్ర‌శ్నలే క‌నిపిస్తున్నాయి కానీ, స‌మాధానాలు క‌నిపించ‌డం లేదు.

కానీ, టీడీపీ నాయ‌కులు మాత్రం ఇంకేముంది .. మా యువ‌నాయ‌కుడు పుంజుకున్నాడు.. ట్విట్ట‌ర్‌లో ఓ వెలుగు వెలిగిపోతున్నాడ‌ని సంబ‌ర‌ప‌డుతున్నారు. సంబ‌రాలు చేసుకుంటున్నారు. కానీ, ఇదంతా ప‌స‌లేని వ్య‌వ‌హార‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీని బ‌తికించాల‌న్నా.. తాను నాయ‌కుడిగా రాటు తేలాల‌న్నా.. ట్విట్ట‌ర్ ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌ద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. రాజ‌కీయాల్లో నిల‌బ‌డాలంటే .. త‌న‌కంటూ.. ప్ర‌జ‌ల్లో విశ్వాసం అందిపుచ్చుకోవాలంటే.. ఖ‌చ్చితంగా ఆయ‌న ఎత్తుల‌కు పైఎత్తులు వేయాల‌ని సూచిస్తున్నారు. అంతేకాదు, ప్ర‌జ‌ల మ‌న‌సులు గెల‌చుకునేలా దూకుడుగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు.

రాజ‌కీయాల్లో కింది స్థాయి నుంచి పైకి ఎదిగిన వారిలో లోకేష్‌కు పెద్ద ఉదాహ‌ర‌ణ ఆయ‌న తండ్రే అని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న విద్యార్తి నాయ‌కుడిగా ఎదిగిన తీరును తెర‌మీదికి తెస్తున్నారు. అదేవిధంగా వార్డు స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ముఖ్య‌మంత్రిగా ఎదిగిన తీరును గుర్తు చేస్తున్నా రు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న దేశంలో చ‌క్రం తిప్పే స్థాయికి ఎద‌గ‌డానికి దాదాపు పాతిక సంవ‌త్సరాలు ప‌ట్టింద‌ని అంటున్నారు. కానీ, లోకేష్ మాత్రం.. తాను ఎమ్మెల్యేగా గెలిచే స‌త్తా లేక‌పోయినా.. `అంతా నేనే.. అంతా నాదే` అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని కూడా చెబుతున్నారు.

ముఖ్యంగా లోకేష్ చేయాల్సిన కీల‌క ప‌ని.. పార్టీలో ఉన్న అనేక మంది సీనియ‌ర్ల నుంచి స‌ల‌హాలు, సూచ న‌ల‌ను స్వీక‌రించాలి. ఓర్పుగా వ్య‌వ‌హ‌రించాలి. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌తో క‌నెక్ట్ అయ్యేందుకు భాష‌ను మెరుగు ప‌రుచుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఉంద‌నేది లోకేష్ గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంది. నిజానికి ఇటీవ‌ల కాలంలో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నా.. లోకేష్ ఏం మాట్లాడుతున్నారో.. కూడా అర్ధం కాని ప‌రిస్థితి నెల‌కొంది. బాధితుల‌కు ఊర‌ట ఇవ్వాల్సిన చోట‌.. మండ‌లిలో ప్ర‌సంగాలు చేసిన ట్టు చేస్తే.. ఎవ‌రికి అర్ధం అవుతుంది. అదేస‌మ‌యంలో పార్ట‌లైన్ ఏంటో.. ముందుగా తెలుసుకుని క‌దా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావాలి. అయితే.. ఈ చిన్న విష‌యాన్ని కూడా ఆయ‌న మ‌రిచిపోతున్నారు.

ఇక్క‌డ ఓ విష‌యం లోకేష్ ముఖ్యంగా తెలుసుకోవాలి. ఆయ‌నేదో మాట్లాడుతున్నాడు.. ట్విట్ట‌ర్‌లో పోస్టులు పెడుతున్నాడు.. లైకులు వ‌స్తున్నాయి. జిందాబాద్ స్లోగ‌న్లు వ‌స్తున్నాయ‌ని అనుకుంటే.. త‌ప్పులో కాలేసిన ట్టే.. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారు. ఆయ‌న మాట్లాడే ప్ర‌తిమాట‌ను నిశితింగా ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. త‌ప్పులు మాట్టాడ‌డం వ‌ల్లే.. గ‌త ఎన్నిక‌ల్లో అభాసుపాలై.. ఐదు వేల ఓట్ల తేడాతో ఓట‌మి పాల‌వ్వాల్సి వ‌చ్చింద‌నే.. విష‌యాన్ని లోకేష్ గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. ఏదో రాజ‌కీయం అంటే.. బుక్ చూసి చ‌దివి నోటికి ఒంట‌బ‌ట్టుకుని వ‌ల్లెవేయ‌డం కాద‌నేది ప్ర‌ధానంగా తెలుసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఇక‌, టీడీపీ సీనియ‌ర్లు కూడా ఇదే విష‌యాన్ని లోకేష్‌కు చెబుతున్నారు. ``మానాయుడు.. గైడ్ చూసి ఇంపార్టెంట్ ప్ర‌శ్న‌లు టిక్ చేసుకుని చ‌దివే స్టూడెంట్ మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇలా అయితే ఏం పాస‌వుతాడు!`` అని పెద‌వి విరుస్తున్నారు. మ‌రి లోకేష్‌లో మార్పు వ‌స్తుందో రాదో చూడాలి.