Begin typing your search above and press return to search.

జనసేన ఎమ్మెల్యే టిక్కెట్.. కమెడియన్ ఆరాటం

By:  Tupaki Desk   |   5 May 2023 9:39 AM GMT
జనసేన ఎమ్మెల్యే టిక్కెట్.. కమెడియన్ ఆరాటం
X
సెలబ్రిటీలు రాజకీయాలలోకి వెళ్లి ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపొయింది. అయితే సినిమా ఇండస్ట్రీ ఉండేవారికి ఫస్ట్ ఛాయస్ సినిమానే అవుతుంది. దాని తర్వాతే రాజకీయం. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో జనసేన పార్టీతో ఎమర్జ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఎన్నికలలో కచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు.

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి అభిమానించే వారు జనసేన సపోర్టర్స్ గా మారిపోతున్నారు. ఇప్పటికే హైపర్ ఆది జనసేన కార్యక్రమాలలో విస్తృతంగా పార్టిసిపేట్ చేస్తూ పవన్ గురించి ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో నెల్లూరు నుంచి అతను జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడనే ప్రచారం నడుస్తోంది.

అయితే ఇప్పుడు మరో కమెడియన్ కూడా జనసేన ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కచ్చితంగా పోటీ చేస్తా అంటూ నేరుగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. రంగస్థలం మూవీ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మహేష్. ఆ సినిమాలో రామ్ చరణ్ తో పాటే ఉండే క్యారెక్టర్ లో మహేష్ నటించి మెప్పించాడు. దీంతో రంగస్థలం మహేష్ గా అతని పేరు మారిపోయింది.

ప్రస్తుతం మహేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భాగానే అవకాశాలు సంపాదిస్తున్నాడు. స్టార్ హీరోల చిత్రాల నుంచి మినిమం బడ్జెట్ మూవీస్ వరకు అన్నింటా కనిపిస్తున్నాడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా నటుడిగా తన ప్రయాణం మొదలు పెట్టిన మహేష్ కి రంగస్థలం సినిమానే గుర్తింపు తెచ్చింది. తాజాగా ఓ యుట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మహేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనది తూర్పు గోదావరి జిల్లా శంఖరగుప్తం. మా ఊరిలో పవన్ కళ్యాణ్ ని అందరూ అభిమానిస్తారు. జనసేన పార్టీ కోసం అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. తనకి జనసేన తరుపున ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి పోటీ చేసే అవకాశం కల్పిస్తే కచ్చితంగా బలంగా నిలబడతాను అంటూ మహేష్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే తన మొదటి ప్రాధాన్యత సినిమాలకే అని చెప్పారు. మొత్తానికి మహేష్ జనసేన నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఆశిస్తున్నాడు అని ఈ ఇంటర్వ్యూ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది.