Begin typing your search above and press return to search.

బెజవాడ టీడీపీకి బాస్ ఎవరు? చంద్రబాబు పంచాయతీకి ఎసరు?

By:  Tupaki Desk   |   22 Feb 2021 3:30 PM GMT
బెజవాడ టీడీపీకి బాస్ ఎవరు? చంద్రబాబు పంచాయతీకి ఎసరు?
X
బెజవాడ టీడీపీలో తెలుగు తమ్ముళ్ల పోరు ఇంకా చల్లారలేదు. ఎంపీ కేశినేని నాని రోజూ ఏదో ఒక వ్యాఖ్యలతో దుమారం రేపుతున్నారు. ఎవరు ఎన్ని చెబుతున్నా పార్టీలోని తన వైరివర్గంపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈరోజు కూడా నాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బెజవాడకు తానే బాస్ అన్నట్లుగా.. తానే విజయవాడకు అధిష్టానమని.. రాష్ట్రానికి చంద్రబాబు అధిష్టానమని అభివర్ణించారు. నాని ఈ వ్యాఖ్యలు చేశారో లేదో ఇంతలోనే టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాకు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపునిచ్చింది. దీంతో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కు ఇద్దరు నేతలు వచ్చారు. బెజవాడ పార్టీలో గ్రూపు గొడవలపై నేతలను చంద్రబాబు పిలిపించారు. ఈ భేటిలో తాజా పరిణామాలను నేతలకు చంద్రబాబు వివరించారు.

ఈ భేటిలో చంద్రబాబుకు అన్ని అంశాలు చర్చించినట్లు బుద్దా వెంకన్న చెప్పారు. ఎంపీ కేశినేనితో కలిసి సాగలేని పరిస్థితులు ేమీ లేవని అంటూనే టీడీపీలో ఎప్పుడు.. ఎవరు గెలిచాన అది చంద్రబాబు వల్లే అంటూ నానికి బుద్దా వెంకన్న కౌంటరిచ్చారు.

విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల వేళ పార్టీ నేతలు అంతర్గత విభేదాలతో రచ్చకెక్కి మాటల యుద్ధానికి దిగడాన్ని టీడీపీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. ఇకపై పార్టీ నాయకులు బహిరంగంగా ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకీడిస్తే సహించేది లేదని హెచ్చరించింది.