Begin typing your search above and press return to search.

'68 దేశాల్లో సంచలనం సృష్టిస్తున్న'మనం యాప్!'

By:  Tupaki Desk   |   31 Oct 2016 12:30 PM GMT
68 దేశాల్లో సంచలనం సృష్టిస్తున్నమనం యాప్!
X
యునైటెడ్ స్టేట్స్‌ - అక్టోబ‌ర్ 31st 2016: 68 దేశాల్లో నివసిస్తున్నతెలుగువారిలో “మనం యాప్” సంచలనం సృష్టిస్తోంది. ఈ దేశాల్లోని తెలుగువారు పరస్పరం కలుసుకోవడానికి - మాట్లాడుకోడానికి - ఒకరి భావాలు మరొకరు పంచుకోడానికి “మనం యాప్” ను ఉపయోగిస్తున్నారు.

అసలు.."మనం యాప్" ఏంటి? నాకు ఎలా ఉపయోగపడుతుంది? నేనెందుకు దీన్ని పట్టించుకోవాలి? అని మీరు అనుకుంటుండవచ్చు.

"మనం యాప్" తెలుగు వారి కోసం తెలుగు వాళ్ళు సృష్టించిన మొబైల్ "యాప్”. ఈ యాప్ మీకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది,

1. మీరు ప్రపంచం లో ఎక్కడ ఉన్నా - మీ దగ్గరలో ఉన్న తెలుగు వారిని కలుసుకోవచ్చు.

- తెలుగువారి వివరాలు తెలుసుకోవచ్చు. పరిచయాలు పెంచు కోవచ్చు. కొత్త హితులతో ముచ్చటించవచ్చు. వ్యాపార సంబంధ సమాచారాన్నితెలుసుకోవచ్చు. పరస్పరం పంచుకోవచ్చు. మీ కొత్త పరిచయాలతో మాత్రమే కాదు - మీకు కావలసిన వారితో కూడా మంచి చెడ్డలు మాట్లాడుకోవచ్చు.

- “మనం యాప్” తో లాభపడిన వారి కొన్ని వాస్తవిక అనుభవాల్ని ఈ కింద పేర్కొంటున్నాం:

“ఇది మహత్తరమైన యాప్. ఈ యాప్ లో చేరిన వారంలోగానే నేను అనేక మంది గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నాను. వారిలో..వింధ్య వారి కుటుంబ సభ్యులున్నారు.” -- అనుషా - మియామి - యు.ఎ స్.ఎ

“మనం యాప్ కు ధన్యవాదాలు. దీని ద్వారా నా కలల రాకుమారిని పొంద గలిగాను” -- శ్రీను - హైదరాబాదు - ఇండియా

“తెలుగు గిఫ్ లు (GIF) అందు బాటులో వున్నందున - నాకు కావలసినవారితో ముచ్చటించాలంటే ఎంతో సౌకర్యంగా వుంది” -- కైలాష్ - న్యూయార్క్ - యు.స్.ఎ

2. మీ భావ వ్యక్తీ కరణకు ఇందులో అవకాశం ఉంది

మీరు చెప్పదలుచుకున్నవిషయాలను/అవసరాలను నేరుగా మీ ప్రొఫైల్ లోని “ఎక్ష్ప్రెస్స్” (Express) ఫీచర్ లో రాయవచ్చు. ఉదాహరణకు మీకు నివాస యోగ్యమైన గది కావాలన్న - పార్ట్ టైం ఉద్యోగం కావాలన్న - ఈ యాప్ లో మీరు నమోదు చేసుకోవచ్చు. తద్వారా ఇతర తెలుగు వారినుంచి మీకు తగిన సహాయం పొందే అవకాశం పెరుగుతింది.

ఓ తెలుగుసోదరుడు ఏమంటున్నాడో చూడండి - "నాకు ‘మనం యాప్’ ద్వారా చక్కటి నివాసం దొరికింది” -- భువన్ - డల్లాస్ - అమెరికా

మీ చుట్టుపక్కల నిత్యం చోటు చేసుకునే పరిణామాలను మిగతా తెలుగు ప్రపంచం తో పంచుకోవచ్చు. ఉదాహరణకు - ఫుడ్ - రాజకీయాలు మొదలైన వాటి గురించి మీరు మీ భావాలను మిగతా తెలుగు సమాజంతో పంచుకోవచ్చు.

మనం యాప్ - తొలి తెలుగు సామాజిక అనుసంధాన యాప్. సరిగ్గా ఏడాది కిందట ఓ సాయం సంధ్యలో కొందరు మిత్రులు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నపుడు వారి మధ్య ఒక ప్రశ్న తలెత్తింది.. అదేమంటే ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా తెలుగు వారు ఉన్నారు కదా.. వీరందరిని కలిపే వేదిక ఏదయినా ఉందా అని.. లేదన్నదే వారికొచ్చిన సమాధానం. ఆ వేదికను మనమే ఎందుకు రూపొందించకూడదు అని ఆ మిత్ర బృందం మదిలో మెదిలిన ఆలోచనల ప్రతిరూపమే ఈ “మనం యాప్”.

ఈ ఉచిత యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ (Download) చేయండి - "ఎక్ష్ ప్రెస్స్" (Express) చేయండి.

ఆపిల్ యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్నివివరాలకు www.manamapp.com లేదా namaste@manamapp.com ద్వారా తమను సంప్రదించవచ్చునని మనం యాప్ సంస్థ స్థాపకులు గిరీష్ కొల్లూరి - బసంత్ వలేటి - హర్షా కాజా లు తెలిపారు.

Press release by: Indian Clicks, LLC