Begin typing your search above and press return to search.

మన విమానాశ్రయాల్లో తెలుగులో అనౌన్సుమెంట్లు

By:  Tupaki Desk   |   26 May 2017 7:16 AM GMT
మన విమానాశ్రయాల్లో తెలుగులో అనౌన్సుమెంట్లు
X
ఆంధ్రప్రదేశ్ లో విమానయానం ఇటీవల కాలంలో బాగా పెరుగుతోంది. ఏసీ రైలు టిక్కెట్లతో దాదాపు సమానమైన ధరలకే విమాన ప్రయాణం సాధ్యం అవుతుండడంతో అంతా అటు మొగ్గుచూపుతున్నారు. అయితే... ఏపీ విమానాశ్రయాల్లో అనౌన్సుమెంట్లు కేవలం హిందీ, ఇంగ్లీష్ లోనే ఉంటుండంతో రాష్ర్టానికి చెందిన కొందరు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇకపై తెలుగులోనూ అనౌన్సుమెంటు చేయడానికి రంగం సిద్ధమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్టుల్లో విమానాల రాకపోకలపై తెలుగులో అనౌన్స్ మెంట్ ఉండేలా చూడాలని కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజుకు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ విన్నవించారు. దీనికి అశోక్ గజపతిరాజు అంగీకారం తెలిపారు. దీంతో, తెలుగులో అనౌన్స్ మెంట్లు వినపడనున్నాయి.

రోవైపు ఇప్పటికే పలు విమానాశ్రయాల్లో స్థానిక భాషల్లో అనౌన్స్ మెంట్లు వినపడుతున్నాయి. ఇప్పుడు ఏపీలో కూడా విమానాశ్రయాల సంఖ్య పెరగడంతో... ఏపీ ప్రభుత్వం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. కేంద్ర మంత్రి కూడా దీనికి సుముఖత వ్యక్తం చేయడంతో ఇకపై ఏపీ ఎయిర్ పోర్టుల్లో తెలుగు వినపడనుంది.

దీనివల్ల చాలామంది ఇబ్బందులు తీరనున్నాయి. ముఖ్యంగా వ్యాపారవర్గాలు, రాజకీయ నాయకులు విమాన ప్రయాణాలు ఎక్కువగా చేస్తున్నారు. చదువుకున్నవారు, వివిధ రాష్ర్టాలు తిరిగి హిందీ, ఇంగ్లీష్ పై పట్టు పెంచుకున్నవారితో ఇబ్బందేమీ లేదు కానీ మిగతావారే ఇబ్బంది పడుతున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ కు వ్యాపార పనులు... తిరుపతికి దర్శనానికి వెళ్తుంటారు. అలాగే తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ ల మధ్య కూడా ఇలాంటి వర్గాల విమానా ప్రయాణాలు ఎక్కువే. హిందీ, ఇంగ్లీష్ రెండూ రాకపోవడంతో వారంతా గందరగోళ పడుతున్నారు. అలాంటివారందరికీ ఇప్పుడు హ్యాపీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/