Begin typing your search above and press return to search.

రక్షించాల్సిన పోలీసులే కామపిశాచుల్లా మారితే ఎలా?

By:  Tupaki Desk   |   20 Aug 2020 7:30 AM GMT
రక్షించాల్సిన పోలీసులే కామపిశాచుల్లా మారితే ఎలా?
X
పోలీసులపై జనాల్లో రోజురోజుకి నమ్మకం - గౌరవం తగ్గిపోతుంది. పోలీస్ శాఖలో కూడా అందరూ అవినీతిపరులే కాదు ..మంచి వారు చాలామంది ఉన్నారు. కానీ , కొందరు చేసే తప్పుల వల్ల అందరికి చెడ్డపేరు వస్తుంది. భాదితుల పాలిట దేవుడిగా - భాదితులకు అండగా నిలవాల్సిన పోలీసులే వేధింపులకు గురిచేస్తే ..ఎవరికీ చెప్పుకోవాలి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. కోరిక తీర్చకపోతే యాసిడ్ పోస్తానంటూ పోలీస్ బెదిరింపులకు దిగాడు. దీనితో ఆ బాధితురాలు .. పై అధికారులను కలవాల్సి వచ్చింది. అసలు విషయమేంటో చూద్దాం..

ప్రస్తుతం వనస్థలిపురంలో నివసిస్తున్న బాధితురాలు వరంగల్‌ లో ఫుడ్‌ ఇన్‌ స్పెక్టర్ ‌గా పని చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం తన పదో తరగతి సర్టిఫికెట్లు పోవడంతో ఫిర్యాదు చేయడానికి మిర్యాలగూడ పోలీసుస్టేషన్‌ కు వెళ్లారు. ఈ క్రమంలోనే అప్పట్లో అక్కడ ఎస్సైగా పని చేస్తున్న చంద్రకుమార్‌ తో బాధితురాలికి పరిచయం ఏర్పడిందట . ఆ సర్టిఫికెట్లు రికవరీ చేసి ఇచ్చిన చంద్రకుమార్‌ అప్పటి నుంచి అప్పుడప్పుడు బాధితురాలికి ఫోన్లు చేసేవారని - మెస్సేజ్ లు పంపేవారని - ఐదేళ్ల క్రితం ఆమె వ్యక్తిగత పనికి సంబంధించిన ఫైల్‌ ను సచివాలయంలో క్లియర్‌ చేయిస్తానంటూ రూ.5 లక్షలు తీసుకున్నాడని - ఆ తర్వాత యాచారం ఇన్‌ స్పెక్టర్ ‌గా బదిలీపై వచ్చిన చంద్రకుమార్‌ బాధితురాలికి తరచూ ఫోన్లు - ఎస్సెమ్మెస్‌ లు పంపుతూ వేధించడం మొదలుపెట్టాడని - తన కోరిక తీరిస్తే వేధింపులు ఆపేస్తానంటూ బెదిరించడంతో బాధితురాలు అతడిని దూరంగా ఉంచడం మొదలెట్టారని. దీంతో ఆమె ఇంటికి వెళ్లి యాసిడ్‌ పోసి చంపేస్తానంటూ బెదిరించాడని. పిల్లల్నీ హత్య చేస్తానంటూ హెచ్చరించాడని ప్రచారం జరుగుతుంది. అలాగే, బాధితురాలి తండ్రికీ ఫోన్లు చేసి దుర్భాషలాడే వారని బాధితురాలు వెల్లడించారు.

దీనిపై , ఆ వేధింపులు - బెదిరింపులు తట్టుకోలేక బాధితురాలు రాచకొండ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అతడికి కౌన్సెలింగ్‌ ఇచ్చారని తెలుస్తుంది. అయితే , కౌన్సెలింగ్ సమయంలో మాత్రం ఇకపై ఆ బాధితురాలి జోలికి వెళ్లనని - ఆమె నుంచి తీసుకున్న నగదు కూడా తిరిగి ఇచ్చేస్తానంటూ చెప్పి చర్యల నుంచి తప్పించుకున్నాడని తెలుస్తుంది. అయితే , ఆ తర్వాత కూడా ఇన్‌ స్పెక్టర్‌ తన ధోరణి మార్చుకోలేదు. బాధితురాలికి నగ్నంగా వీడియో కాల్స్‌ చేయడం మొదలెట్టాడు. ఇలా అయన వికృత చేష్టలు ‌శ్రుతి మించుతుండటంతో బాధితురాలు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ తో పాటు వనస్థలిపురం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో నగర కొత్వాల్‌ అతడిని సస్పెండ్‌ చేయగా వన స్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఐతే , తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నా ఎస్బీ సీఐ చంద్రకుమార్‌ ను ఇప్పటివరకూ అరెస్ట్‌ చేయలేదని బాధితురాలు తన ఆవేదన వ్యక్తం చేశారు. వనస్థలిపురం పోలీసులు ఆయనను రక్షిస్తున్నారని ఎఫ్ ‌ఐఆర్‌ నమోదై మూడు రోజులు గడుస్తున్నా అరెస్ట్‌ చేయలేదని - మహిళలను మానసికంగా వేధిస్తున్న సీఐ చంద్రకుమార్ ‌ను వదలకూడదని ఆమె డిమాండ్‌ చేశారు. అయితే , మహిళపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సీఐ ని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ మూడు రోజుల క్రితం విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. ఆయనపై ఇప్పటికే నిర్భయ కేసు నమోదు అయింది.