Begin typing your search above and press return to search.

మేకిన్ ఇండియా అంటే ఇదేనా మోడీ మాష్టారు?

By:  Tupaki Desk   |   4 July 2019 4:41 AM GMT
మేకిన్ ఇండియా అంటే ఇదేనా మోడీ మాష్టారు?
X
మ‌రింత లోతుల్లోకి వెళ్లే క‌న్నా.. ఉన్న విష‌యాన్ని ఉన్న‌ట్లుగా చూస్తే చాలు.. మోడీ మాష్టారి ఫెయ్యిలూర్ పాల‌న ఎంత‌న్న‌ది ఇట్టే అర్థం కాక మాన‌దు. ప్ర‌ధానిగా మోడీ అధికారంలోకి వ‌చ్చిన ఐదేళ్లు దాటి.. ఆరో ఏడు దిశ‌గా ప‌య‌నిస్తోంది. రెండో ట‌ర్మ్ దేశ ప్ర‌ధానిగా అయిన ఆయ‌న‌.. తాను దేశానికి చాలా చేశాన‌ని ప‌దే ప‌దే గొప్ప‌లు చెప్పుకుంటుంటారు. మ‌న్ కీ బాత్ ద‌గ్గ‌రి నుంచి మామూలు కార్య‌క్ర‌మంలో పాల్గొనే వ‌ర‌కూ చూస్తే.. తాను హాజ‌రైన వేదిక మీద నుంచి కాసిన్ని గొప్ప క‌బుర్లు చెప్పేస్తుంటారు.

త‌న‌కున్న విజ‌న్ ను.. త‌న‌కున్న క‌మిట్ మెంట్ ను అదే ప‌నిగా ప్ర‌ద‌ర్శించుకునే ఆయ‌న.. త‌న ప్ర‌భుత్వాన్ని చేత‌ల ప్ర‌భుత్వంగా మార్చారా? అంటే లేద‌నే చెప్పాలి. త‌న మానస‌పుత్రిక అయిన మేకిన్ ఇండియా కాన్సెప్ట్ నే చూద్దాం. అంత‌రిక్షానికి పంపే రాకెట్ ను మ‌న‌కు మ‌న‌మే సొంతంగా త‌యారు చేసుకుంటున్నామ‌ని డ‌ప్పు కొట్టుకునే ముందు.. ప్ర‌తి ఇంట్లో త‌ప్ప‌నిస‌రిగా ఉండే టీవీల్ని విదేశాల నుంచి త‌యారు చేయించుకొని తెచ్చుకోవ‌టం చూస్తే.. ఇదేనా మోడీ వారి మేకిన్ ఇండియా అనిపించ‌క మాన‌దు.

ఎందుకంటే.. ఇవాల్టి రోజున దేశంలో టీవీ లేని ఇల్లు అన్న‌ది దాదాపుగా లేద‌నే చెప్పాలి. రోడ్డు ప‌క్క‌న వేసుకునే గుడిసెలోనూ టీవీ.. దానికో డిష్ క‌నెక్ష‌న్ ఉండే ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. ప్ర‌తి ఇంటికి టీవీ అన్న‌ది ప్రాథ‌మిక అవ‌స‌ర‌మైంది. మ‌రి.. అలాంటి టీవీల్ని దేశీయంగా త‌యారు చేసుకోలేని ప‌రిస్థితి ఏమిటి? దేశంలో టీవీలు ఉత్ప‌త్తి అవుతున్నా.. 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో మ‌నం విదేశాల నుంచి ఏకంగా రూ.7,224 కోట్ల విలువైన టీవీల‌ను దిగుమ‌తి చేసుకున్న‌ట్లుగా గ‌ణాంకాలు చెబుతున్నాయి.

ఇలా దిగుమ‌తైన టీవీల్లో స‌గం చైనా నుంచి రావ‌టం మ‌రో ఆస‌క్తిక‌ర అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు. విదేశాల నుంచి వేలాది కోట్లు వెచ్చింది దిగుమ‌తి చేసుకుంటున్న టీవీల‌న్ని ఐదు దేశాల నుంచేకావ‌టం గ‌మ‌నార్హం. అదే టీవీల్ని మ‌న దేశంలోనే ఉత్ప‌త్తి అయ్యేలా చేసుకుంటే.. బోలెడంత ఉపాధి అవ‌కాశాల‌తో పాటు.. ముఖ్య‌మైన విదేశీ మార‌కం దేశం ఖ‌ర్చు పెట్టాల్సిన అవ‌స‌రం ఉండ‌దు క‌దా? అలాంట‌ప్పుడు విదేశాల నుంచి దిగుమ‌తి చేసే సంస్థ‌లు.. దేశీయంగానే త‌యారు చేసేలా చేస్తే.. దేశానికి ఎంత లాభం. నిత్యం దేశం కోసం మాత్ర‌మే ఆలోచించే మోడీ మాష్టారి లాంటి నేత ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు కూడా ఇన్నేసి వేల కోట్లు పోసి బ‌య‌ట దేశం నుంచి టీవీలు కొనుక్కోవాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. విదేశాల నుంచి దిగుమ‌తి అయ్యే టీవీల్లో అత్య‌ధికంగా ఎల్ ఈడీ.. ఎస్ సీడీ.. ప్లాస్మా టీవీల‌ను మ‌న‌కు మ‌న‌మే త‌యారు చేసుకునేలా త‌గు చ‌ర్యలు తీసుకుంటామ‌ని చెప్ప‌టం దేనికి నిద‌ర్శ‌నం? ఇదేనా మోడీ వారి మొన‌గాడి పాల‌నా?