Begin typing your search above and press return to search.

100 కోట్ల క్లబ్ లో ఇండియా

By:  Tupaki Desk   |   31 Dec 2015 5:07 PM IST
100 కోట్ల క్లబ్ లో ఇండియా
X
జనాభా విషయంలో రెండో స్థానంలో ఉన్న భారత దేశం ఇప్పుడు మొబైళ్ల వినియోగం విషయంలోనూ రెండో స్థానానికి వచ్చేసింది. ఇండియాలో మొబైల్ వినియోగదారుల సంఖ్య 100 కోట్లు దాటేసిందట. ట్రాయ్ వర్గాలే ఈ సంగతి స్వయంగా ప్రకటించడంతో ఈ సంగతి నిజమేనని తేలింది. మొన్న అక్టోబరు నెలలోనే 70 లక్షల మంది కొత్త కస్టమర్లు చేరారని... ఆ దెబ్బకు 100 కోట్ల మార్కు దాటేసిందని ట్రాయ్ ప్రకటించింది.

కాగా మొబైల్ వినియోగదారుల సంఖ్య విషయంలో చైనా టాప్ లో ఉంది. 2012లోనే చైనా 100 కోట్ల మార్కును దాటేసింది. తాజాగా భారత్ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

మొబైల్ వినియోగదారుల సంఖ్య ఇండియాలో నిత్యం పెరుగుతోంది. కంపెనీల మధ్య పోటీ కారణంగా తక్కువ ధరలకు సిమ్ లు ఇస్తుండడం... ఆఫర్లు కారణంగా కనెక్షన్ తీసుకోవడం సులభమైపోయింది. అయితే... ఇండియాలో 100 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్నప్పటికీ బీహార్ మాత్రం ఈ విషయంలో బాగా వెనుకబడి ఉందట. బీహార్ లో కేవలం 54 శాతం మందికే ఫోన్ కనెక్షన్లు ఉన్నాయట.

మొత్తానికి చైనాతో అన్నిరకాలుగా పోటీపడుతున్న ఇండియా ఇప్పుడు ఈ విషయంలోనూ చైనాను వెంబడిస్తోంది. 100 కోట్ల మొబైల్ వినియోగదారులు ఉన్న దేశాలు కేవలం రెండే కావడం.. ఆ రెండు ఆసియాలోనే పక్కపక్కనే ఉండడం విశేషం.