Begin typing your search above and press return to search.

మోడీ నిర్ణయాలతో వణుకుతున్న టెలికాం ఆపరేటర్లు

By:  Tupaki Desk   |   28 Dec 2019 5:07 AM GMT
మోడీ నిర్ణయాలతో వణుకుతున్న టెలికాం ఆపరేటర్లు
X
కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకునే నిర్ణయాలతో టెలికం కంపెనీలకు చుక్కలు కనిపిస్తున్నాయట. వరుస పెట్టి వివాదాస్పద అంశాలపై తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా దేశంలో నిరసనలు.. ఆందోళనలు వెల్లువెత్తటం తెలిసిందే. ఇటీవల పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు సాగుతున్నాయి. రోజుల తరబడి సాగుతున్న ఈ ఆందోళనలు ఒక ఎత్తు అయితే.. ఇలాంటి వేళలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కేంద్రం ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేస్తున్నారు.

శాంతిభద్రతల బూచిని చూపించి.. ఇంటర్నెట్ ను నిలిపివేస్తున్న కారణంగా టెలికం కంపెనీలు భారీగా నష్టపోతున్నాయని చెబుతున్నారు. తమ నిరసనల్ని చాటేందుకు.. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై తమ స్పందన తెలియజేందుకు ప్రజలు రోడ్ల మీదకు రావటమే కాదు.. వివిధ రకాలైన వీడియోలు.. పోస్టులు పెడుతున్నారు. ఇవి వైరల్ అవుతూ మిగిలిన ప్రాంతాలకువిస్తరిస్తున్నాయి.

దీంతో.. నిరసనలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ఉండేందుకు వీలుగా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేస్తున్నారు. కేంద్రం తీరుపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్రుగా ఉండటమే కాదు.. టెలికం కంపెనీల కిందామీదా పడుతున్నాయట. మోడీ సర్కారు నిర్ణయాల కారణంగా గంటకు తమకు వాటిల్లే నష్టం రూ.2.45 కోట్లు ఉంటున్నట్లుగా పరిశ్రమ వర్గాలు లెక్క కట్టి మరి చెప్పటం గమనార్హం.