Begin typing your search above and press return to search.

తెలంగాణ వైసీపీ అధ్య‌క్షుడి రాజీనామా!

By:  Tupaki Desk   |   3 April 2021 12:30 PM GMT
తెలంగాణ వైసీపీ అధ్య‌క్షుడి రాజీనామా!
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు గ‌ట్టు శ్రీకాంత్ రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ మేర‌కు పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి లేఖ రాశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా తెలంగాణ‌లో వైసీపీని విస్త‌రించే ఆలోచ‌న లేద‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించిన‌ తీసుకున్న నేప‌థ్యంలోనే.. తాను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వెల్ల‌డించారు.

తీవ్ర ఆవేద‌న‌తో పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి, అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు చెప్పారు. త‌న‌కు జ‌గ‌న్ తో స‌న్నిహిత సం‌బంధాలు ఉన్నాయ‌ని, 2007 నుంచి ఆయ‌న‌తో క‌లిసి న‌డుస్తున్న‌ట్టు లేఖ‌లో పేర్కొన్నారు శ్రీకాంత్‌. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న వెన్నంటే ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, జ‌గ‌న్ భ‌విష్య‌త్ లో మ‌రిన్ని గొప్ప స్థానాలు అధిరోమించాల‌ని ఆశిస్తున్న‌ట్టు చెప్పారు.

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీకాంత్‌.. జాతీయ పార్టీల్లో చేర‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రాబోయే రోజుల్లో హుజూర్ న‌గ‌ర్ అసెంబ్లీ స్థానం నుంచి బ‌రిలో దిగాల‌ని భావిస్తున్న‌ట్టు చెప్పారు. అయితే.. జాతీయ పార్టీ అని చెప్పిన నేప‌థ్యంలో.. బీజేపీలోకి గ‌ట్టు శ్రీకాంత్ వెళ్తార‌ని ప్ర‌చారం సాగుతోంది.