Begin typing your search above and press return to search.
కెబిసి 12 లో తెలంగాణ మహిళా 'టీచర్ ' !
By: Tupaki Desk | 6 Oct 2020 10:10 AM GMTప్రముఖ రియాలిటీ షో 'కౌన్ బనేగా క్రోరోపతి' 12 వ సీజన్ ఈ మద్యే అట్టహాసంగా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే , కరోనా కారణంగా కేబీసీలో కొన్ని మార్పులు చేశారు. ఫాస్టెస్ట్ ఫింగర్ పరీక్షా రౌండ్ కు హాజరయ్యే వారిని హోటల్ లో క్వారంటైన్ చేసి ఆ తరువాత గేమ్ లో పాల్గొనేలా ప్రణాళికలు వేశారు. 20 సంవత్సరాలలో మొదటిసారి, ప్రత్యక్ష ప్రేక్షకులు లేకుండా KBC రన్ అవుతుంది. అందువల్ల లైఫ్లైన్ 'ఆడియన్స్ పోల్' స్థానంలో 'వీడియో-ఎ-ఫ్రెండ్' ను తీసుకువచ్చారు.
ఇకపోతే , ఈ రియాలిటీ షో లో తెలంగాణ నుంచి సబితా రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ లోని అల్వాల్ ప్రాంతంలో ఆమె టీచర్ గా పనిచేస్తున్నారు. అయితే, ఎప్పుడూ సరదా సరదాగా ఈ కౌన్ బనేగా క్రోరోపతి షోను నడిపించే బిగ్ బీ సబితా యొక్క జీవిత విషయాలు , ఆమె పడిన కష్టాల గురించి తెలుసుకుని చాలా భాగోద్వేగానికి గురైయ్యారు. భర్తను కోల్పోయి, పిల్లలను పెంచి పెద్ద చేసిన తీరు పట్ల ఆయన ఆమె పై ప్రశంసలు కురింపిచారు. స్ఫూర్తిమంతమైన జీవన ప్రయాణమని అమితాబ్ కొనియాడారు. ఒక టీచర్ గా పిల్లలకు మంచి విద్యను అందిస్తానని సబిత చెప్పుకొచ్చారు. జీవితంలో పిల్లలకు ఆస్తులు ఇవ్వకున్నా కానీ, మంచి విద్యను అందివ్వాలని చెప్పారు. ఆమె పాల్గొన్న కేబీసీ సీజన్ 12, ఆరో ఎపిసోడ్ సోనీ టీవీలో మంగళవారం రాత్రి ప్రసారమవనుంది. ప్రస్తుతం సోనీ ప్రీమియం సబ్‌స్క్రైబర్ల కు ఇప్పటికే ఈ ఎపిసోడ్ అందుబాటులో ఉంది.