Begin typing your search above and press return to search.

అమెరికాలో తెలంగాణ మహిళ అనుమానాస్పద మృతి

By:  Tupaki Desk   |   7 April 2019 5:40 PM IST
అమెరికాలో తెలంగాణ మహిళ అనుమానాస్పద మృతి
X
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ కు చెందిన 24 ఏళ్ల సెగ్గెం సంధ్య అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం విషాదం నింపింది. 8 నెలల క్రితమే ఈమెను తొర్రూర్ సాయినగర్ కు చెందిన దూకుంట్ల శ్రీకాంత్ కు ఇచ్చి వివాహం జరిపించారు. శ్రీకాంత్ తన తల్లిదండ్రులు రాజేశ్వర్-విజయలతో కలిసి అమెరికాలోని టెనిస్సీ రాష్ట్రంలో ఉంటూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు.

పెళ్లి అయిన ఆరు నెలలు కాపురం సజావుగానే సాగింది. శనివారం ఉదయం తొర్రూర్ లో ఉంటున్న సంధ్య తల్లిదండ్రులు మహేందర్-విమలకు అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. సంధ్య గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుపడంతో హతాషులయ్యారు.

అయితే అదనపు కట్నం కోసమే తమ కుమార్తె సంధ్యను భర్త, అత్తమామలే హత్య చేశారని.. రెండు నెలల నుంచి వేధిస్తున్నారని సంధ్య తండ్రి మహేందర్ ఆరోపించాడు. ఈ మేరకు ఆయన తొర్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన బిడ్డను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా సంధ్య అనుమానాస్పద మృతిపై అమెరికాలోని టెన్నెస్సీలో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.