Begin typing your search above and press return to search.

మహిళ ఐఏఎస్ ఇష్యూ.. ఇక సెక్యూరిటీ టైట్..

By:  Tupaki Desk   |   23 Jan 2023 10:29 AM GMT
మహిళ ఐఏఎస్ ఇష్యూ.. ఇక సెక్యూరిటీ టైట్..
X
తెలంగాణలోని ఓ మహిళా ఐఏఎస్ ఇంట్లోకి డిప్యూటీ తహసీల్దార్ చొరబడిన ఘటన కలకలం రేపింది. ఆమె నివసించే ప్రాంతం అత్యంత భద్రతతో కూడి ఉంటుంది. అయినా అర్ధరాత్రి ఓ వ్యక్తి నేరుగా ఆమె తలుప తట్టడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక ఐఏఎస్ అధికారిణి పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్య మహిళలు భద్రత ఎలా..? అని కొందర విమర్శలు గురిపిస్తున్నార. ఈ ఘటనపై కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్ పాలనలో మహిళలకు ఎంత భద్రత ఉందో దీనిని భట్టి తెలుసకోవచ్చని అన్నార. అయితే రాష్ట్ర రాజధాని.. అదీ సీఎం పేషీలోని మఖ్య అధికారిణికి ఇలాంటి అనభవం ఎదురుకావడం రాష్ట్ర వ్యాప్తంగా రకరకాలుగా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు భద్రతను మరింతగా పెంచారు. సెక్యూరిటీని టైట్ చేసి అప్రమత్తమయ్యారు.

గత ఏడాది కాలంగా తెలంగాణలో అత్యాచారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. గత జూన్ నెలలో కొందరు యువకులు ఓ బాలికపై నగర నడి సెంటర్లో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం కొన్ని రోజుల తరువాత బయటపడినా సంచలనం రేపింది. హైదరాబాద్ నగరంలోనే ఇంత దారుణానికి ఒడిగట్టడానికి యువకులు ప్రయత్నించారంటే వారికి పోలీసుల పట్ల ఎంత భయం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి దారుణానికి పాల్పడినా నాయకుల అండదండలతో పోలీసుల నుంచి బయటపడవచ్చు.. అనే ధైర్యం వారిలో ఉందని కొన్ని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నారు.

మహిళా భద్రత కోసం షీ టీంల లాంటి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. కానీ అవి ప్రారంభమైన కొన్ని రోజులు మాత్రమే హడావుడిగా పనిచేస్తున్నాయి. ఆ తరువాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది.

ఇప్పుడు కూడా ఓ ఐఏఎస్ అధికారిణికి ఇలాంటి సంఘటన ఎదురైనా కొన్ని రోజులు మీడియాలో హల్ చల్ చేసి.. ఆ తరువాత ఈ సంఘటనను మైమరిపించే అవకాశాలు లేకపోలేదు.

అయితే ప్రస్తుతం పోలీసులు ఆమెకు టైట్ సెక్యూరిటీ ఇచ్చామని చెబుతున్నారు. అధికారిని నివసిస్తున్న ప్రాంతం గ్రేటేడ్ కమ్యూనిటీ ఏరియా. అంతేకాకుండా సిటీ కమిషనర్ అక్కడే నివసిస్తున్నారు. పోలీస్ లైన్స్ లోని ప్లెజెంట్ వాలీ అయినందన 24 గంటల సెక్యూరిటీ ఉంటుంది. ఇంత భద్రతను చేధించుకొని నిందితుడు మహిళా అధికారిని ఇంటిదాకా వెళ్లడంపై భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇక నుంచి అణువణువుగా పరిశీలించి లోనికి పంపించే అవకాశం ఉంది. తాను ఎవరిని కలవడానికి వచ్చారో వివరాలు సమర్పించిన తరువాత అనుమతి ఇవ్వనున్నారు.

కానీ సామాన్యులకు ఎవరూ సెక్యూరిటీ ఇవ్వాలి..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కొందరు ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు అనడానికి ఇందపెద్ద సంఘటన ఉదాహరణ కాదా..? అని విమర్శించడంతో వారి వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది. ఇప్పటికైనా మహళల రక్షణ విషయంలో పోలీసులను అప్రమత్తం చేయకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రజల రక్షణ కోసం గులాబీ ప్రభుత్వం మిగతా వాటికంటే ఎక్కువగా నిధులు విడుదల చేస్తుంది. వారు పిలిస్తే 5 నిమిషాల్లో ఉండే విధంగా వాహనాలను కేటాయిస్తోంది. అంతేకాకుండా ఈ విభాగంలో ఖాళీలను నిత్యం భర్తీ చేస్తోంది. అయినా ఇలాంటి సంఘటనలు చూడడం బాధాకరమని కొందరు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.