Begin typing your search above and press return to search.
అప్పుల్లో తెలుగు రాష్ట్రాల పోటీ.. ఎవరికే స్థానం?
By: Tupaki Desk | 14 July 2020 4:00 AM GMTతెలుగు ప్రజలపై సంక్షేమ జల్లు కురిపిస్తున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు తాహతకు మించి అప్పులు చేస్తూ మళ్లీ ప్రజలపైనే భారం మోపుతున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కోసం అప్పులు చేస్తూ తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నట్టు తాజా నివేదికలో తేలింది.
ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు తెలుగు రాష్ట్రాల అప్పుల కుప్పపై తాజాగా బులిటెన్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణకు అప్పులు తీసుకోవడంలో ర్యాంకులు కూడా ఇవ్వడం విశేషం. జనాభా పరంగా దేశంలోనే నంబర్ 1గా ఉత్తరప్రదేశ్ అప్పులు తీసుకోవడంలోనూ నంబర్ 1గా నిలిచింది. దేశంలో అత్యధిక రుణాలు తీసుకున్న రాష్ట్రాల్లో యూపీ నంబర్ 1 కాగా.. ఆ తర్వాత తమిళనాడు నిలిచాయి.
ఇక అప్పులు తీసుకోవడంలో దేశంలోనే మూడో స్థానాన్ని మన ఏపీ కైవసం చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఏపీలో అప్పులు 42శాతం పెరిగాయి. గత ఏడాది ఏపీలో 6వ స్థానంలో ఉండగా.. ఈ సంవత్సరం మరిన్ని అప్పులు తీసుకొని 3వ స్థానానికి చేరింది.
ఇక తెలంగాణలో అప్పుల భారం 38శాతం పెరిగింది. అప్పులు తీసుకోవడంలో గత ఏడాది తెలంగాణ 9వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 6వస్థానంలో ఉంది.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు స్థానాలు పైకి ఎగబాకి అప్పులు తీసుకోవడంలో ముందంజలో నిలిచాయి. ఇలా దేశంలోనే అప్పులు తీసుకునే రాష్ట్రాల్లో ప్రముఖంగా నిలిచాయి.