Begin typing your search above and press return to search.
తెలంగాణా ఓటర్లు కంఫ్యూజ్ లో ఉన్నారా...?
By: Tupaki Desk | 8 Jun 2023 5:00 AM GMTతెలంగాణా కు మరో అయిదు నెలల లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి గెలిచేది మేమే అని ప్రధాన పార్టీలు అన్నీ జబ్బలు చరచుకుంటున్నాయి. అయితే ఓటర్లు మాత్రం గుంభనంగా ఉన్నారు. వారి అభిప్రాయం ఏంటో బయటపడడం లేదు. బీయారెస్ వరస గా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తోంది.
ఆ దిశగా కేసీయార్ తన వ్యూహాల కు పదును పెడుతున్నరు. ఆయన నిన్నటి దాకా బీజేపీ ని తీవ్రంగా విమర్శించేవారు. ఇపుడు మాత్రం ఆయన కాంగ్రెస్ మీద పడ్డారు. మరో వైపు చూస్తే కాంగ్రెస్ లో కూడా ఎన్నడూ లేని విధంగా ఒక ఉత్సాహం అయితే కనిపిస్తోంది. ఈసారి ఎలాగైనా పీఠాన్ని పడతామన్న ధీమా కూడా వారి లో పెరుగుతోంది. బహుశా అది కర్నాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన హుషార్ కావచ్చు అంటున్నారు.
గతం తో పోలిస్తే కాంగ్రెస్ లో కొంత ఐక్యత కూడా కనిపిస్తోంది. ముందు పార్టీని ఏదో విధంగా అధికారం లోకి తెచ్చుకుంటే చాలు ఆ మీదట పదవుల విషయం చూసుకోవచ్చు అని సీనియర్లు సహా అంతా ఒక మాట మీద కు వస్తున్నారు.
బీజేపీ విషయాని కి వస్తే ఆ పార్టీ మునుగోడు ఎన్నికల నుంచి గ్రాఫ్ తగ్గించుకుంటూ వస్తోంది. కర్నాటక ఎన్నికల ఫలితాల తరువాత బాగా డల్ అయింది అని అంటున్నారు. కమలం పార్టీ లో కొత్త చేరికలు లేకపోగా ఉన్న వారే పక్క చూపులు చూసే అవకాశం ఉంది అని అంటున్నారు. అయినా సరే మాదే అధికారం అని కాషాయ పెద్దలు ఢంకా భజాయిస్తున్నారు.
త్రిముక పోరు జరిగితే తెలంగాణా లో మరోమారు అధికారం లోకి రావడం ఈజీ అని బీయారెస్ భావిస్తోంది. కానీ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ బీజేపీ గ్రాఫ్ మరింతగా తగ్గిపోతే ఆల్టర్నేషన్ గా స్ట్రాంగ్ గా కాంగ్రెస్ అవతరిస్తుంది అన్న బెంగ భయాలు కూడా టీయారెస్ లో ఉన్నాయని అంటున్నారు. అందుకే ఆ పార్టీని కేసీయార్ గట్టిగా టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు.
సరే ఏ పార్టీకి ఆ పార్టీ తన ప్రయత్నాల ను ముమ్మరం చేస్తోంది. ఇపుడు కాకపోతే మరెపుడు అన్నట్లుగా వ్యూహాలకు కూడా పదు ను పెడుతూ రనంలోకి దూసుకుని వస్తొంది. కానీ తెలంగాణా ప్రజల తీరే ఏ రాజకీయ నాయకుడి కీ అర్ధం కావడం లేదు. ఎన్నో ఎన్నికల ను చూసిన తలపండిన ఆసాముల కు కూడా జనాల మూడ్ ఏంటో అర్ధం కావడంలేదు.
తెలంగాణా ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే చెప్పలేని పరిస్థితి ఉంది అని అంటున్నారు. తెలంగాణా ప్రజలు పూర్తి కన్ఫ్యూజన్ లో ఉన్నారా అన్న చర్చ కూడా సాగుతోంది అని అంటున్నారు. బీయారెస్ రెండు దఫాలుగా అధికారంలో ఉంది ఆ పార్టీ చేయాల్సిన పనులు చేసింది. ప్లస్సులు మైనస్సులు ఉన్నాయి. ఇక మూడవసారి అంటే ఎటూ యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది.
అయినా కానీ ఆ పార్టీ అయితే మళ్ళీ గెలుస్తామని అంటోంది. తమ ప్రభుత్వం తొమ్మిదేళ్ల లో చేసిన అభివృద్ధి పనులను వల్లె వేస్తోంది. ఇక పల్లె పట్టులో బీయారెస్ మీద కొంత సానుభూతి ఉందని అంటున్నారు అలాగే పధకాలు కూడా ప్రభావం చూపుతాయని అంటున్నరు.
అలా బీయారెస్ మీద జనాల కు కొంత మోజు కొంత డౌట్ ఉన్న సీన్ కనీప్స్తోంది. అలాగే కాంగ్రెస్ విషయం తీసుకుంటే ఆ పార్టీ ని గెలిపించాలని ఉన్నా ఎవరు సీఎం అవుతారు అన్నది మాత్రం క్లారిటీ లేదు. సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగానే సీన్ కనిపిస్తోంది అని అంటున్నారు.
కర్నాటక లో చూసుకుంటే డీకే శివ కుమార్ ఈసారి సీఎం అంటూ పెద్ద ఎత్తున ప్రచార పర్వంలో సాగింది. అదే విధంగా మరో నేతగా సిద్ధ రామయ్య కూడా జనాల కు కనిపించారు. ఇద్దరూ చేతులు కలిపి మొత్తం కలియ తిరగడం తో హస్తం పార్టీకి అది బాగా మేలు చేకూర్చింది. అలాంటి స్ట్రాంగ్ లీడర్ అయితే తెలంగాణా కాంగ్రెస్ లో కనిపించడంలేదు అని అంటున్నారు.
పైగా కాంగ్రెస్ ని గెలిపిస్తే పధకాలు ప్రస్తుత స్కీం లు అమలు అవుతాయా అన్న చర్చ ఉంది. అలాగే కాంగ్రెస్ తో స్థిరమైన ప్రభుత్వం వస్తుందా. ముఖ్యమంత్రుల మార్పు తరచూ జరుగుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. బీజేపీ విషయంలో కూడా ఓటర్ల కు ఏమీ ప్రత్యేక అభిప్రాయాలు లేవు. అర్బన్ ఓటర్లు కొంత వరకూ టర్న్ కావచ్చు అంటున్నారు.
ఏది ఏలా ఉన్నా ఏకమొత్తంగా బీయారెస్ ని దించేయాలన్న భావన అయితే రావడంలేదు అంటున్నారు. అదే టైం లో వన్ సైడెడ్ గా కాంగ్రెస్ ని నెత్తికెత్తుకోవాలన్న ఆలోచన కూడా కనిపించడంలేదు అని అంటున్నారు. మొత్తానికి తెలంగాణా లోని నాలుగున్నర కోట్ల మంది ప్రజల అభిప్రాయం కన్సాలి డేట్ కావాలంటే ఇంకా ఎన్నికలు దగ్గర పడాల్సి ఉందని అంటున్నారు.