Begin typing your search above and press return to search.
మేడారం జాతరకు హెలికాఫ్టర్ లో వెళ్తారా?
By: Tupaki Desk | 2 Feb 2020 4:57 PM GMTతెలంగాణ ప్రజానీకం ఎంతో ప్రతిష్టాత్మకంగా, ప్రత్యేకంగా భావించే మేడారం జాతరకు రంగం సిద్ధమైంది. ఈ నెల 5 నుంచి 8 వరకు నాలుగు రోజుల పాటు వరంగల్ జిల్లాలో సమ్మక్క సారలమ్మ వేడుకకు మేడారం సిద్ధమవుతోంది. ఈ వేడుకలకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మేడారం జాతరలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. వెయ్యేళ్ల ఘన చరిత్ర ఉన్న మేడారం జాతరకు ఒకప్పుడు ఎడ్లబండ్లలో జనాలు తరలి వెళ్లేవారు. ఇప్పుడు హెలికాఫ్టర్లలో జనం ఆ వేడుకకు వెళ్తుండటం విశేషం. హెలికాఫ్టర్లలో భక్తుల్ని జాతరకు తీసుకెళ్లే సేవలు గతంలోనే ఉన్నాయి కానీ.. ఈ ఏడాది హైదరాబాద్ నుంచి భక్తుల కోసం చాపర్ సేవలు నడుస్తుండటం విశేషం.
తెలంగాణ టూరిజం శాఖ మేడారంకు హెలికాఫ్టర్ సర్వీసులను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్‌తో కలిసి టూరిజం శాఖ చాపర్‌ను ప్రారంభించింది. ఈ చాపర్ హైదరాబాదు నుంచి బయలు దేరుతుంది. మేడారం వెళ్లే వారికి రెండు రకాల ప్యాకేజీలను ప్రకటించింది. ఆరుగురిని ఒకేసారి తీసుకెళ్లే ప్యాకేజీ కింద 1.8 లక్షలు కట్టాలి. జీఎస్టీ ఇందుకు అదనం. ఈ ప్యాకేజీలో హెలికాఫ్టర్ చార్జీలు - హైలీప్యాడ్ నుంచి ఆలయం వరకు ప్రత్యేక వాహనం ఆ పై వీఐపీ దర్శనం ఉంటుంది. హెలికాఫ్టర్ సేవలు 2010 నుంచే ప్రారంభమయ్యాయి. రాష్ట్ర టూరిజం శాఖ ఈ హెలికాఫ్టర్లను నడుపుతోంది. 2010లో ఒకసారి వెళ్లి వచ్చేందుకు రూ.6 వేల ఛార్జీని వసూలు చేసేది. అయితే ఈ సర్వీసులు పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత సర్వీసులను నిలిపివేయడం జరిగింది. ఇక టూరిజం శాఖ తిరిగి 2014, 2016 జాతరకు ప్రవేశపెట్టాలని ప్రయత్నించి విఫలమైంది. ఆ తర్వాత 2018లో తిరిగి హెలికాఫ్టర్ సర్వీసులను ప్రారంభించింది.