Begin typing your search above and press return to search.

విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో టాప్‌ లో తెలంగాణ.. దిగువలో ఏపీ!

By:  Tupaki Desk   |   25 Jan 2023 3:00 PM GMT
విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో టాప్‌ లో తెలంగాణ.. దిగువలో ఏపీ!
X
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లో ఆకర్షణలో తెలంగాణ టాప్‌ టెన్‌ లో 7వ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్‌ 14వ స్థానానికి పడిపోయింది. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం.. అక్టోబర్‌ 2019 – సెప్టెంబర్‌ 2022 మధ్య రూ. 12,61,471 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐలు) భారతదేశానికి వచ్చాయి.

ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 27.87% అంటే రూ. 3,51,330 కోట్లు మహారాష్ట్రకు తరలిపోయాయి. రూ. 2,93,106 కోట్లతో 23.26%తో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. చంద్రబాబు హయాంలో 2014–19 మద్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ టాప్‌ 5లో నిలిచిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌ లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులు, ఉపాధి కల్పన కంటే ఉచిత పథకాలకు ప్రాధాన్యత ఇస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఉచిత పథకాలతో ఆంధ్రప్రదేశ్‌ కూడా శ్రీలంక మాదిరిగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయమనే ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దీంతో ఇప్పుడు టాప్‌-10 రాష్ట్రాల జాబితాలో కూడా ఆంధ్రప్రదేశ్‌ చోటు దక్కించుకోలేదు. అక్టోబర్‌ 2019 - సెప్టెంబర్‌ 2022 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌ కు రూ. 4,960 కోట్ల ఎఫ్‌డిఐలు మాత్రమే వచ్చాయని తెలుస్తోంది. ఇది భారతదేశానికి వచ్చిన మొత్తం ఎఫ్‌డిఐలలో 1% కూడా కాదని చెబుతున్నారు. భారత్‌కు లభించిన మొత్తం ఎఫ్‌డిఐలలో ఇది 0.39% మాత్రమే.

ఇదే సమయంలో పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇదే కాలంలో రూ.33,025 కోట్ల విలువైన ఎఫ్‌డిఐలను పొంది దేశంలో ఏడవ స్థానంలో ఉంది. అంటే తెలంగాణ ప్రభుత్వానికి దక్కిన దానిలో ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 15% మాత్రమే దక్కిందని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.