Begin typing your search above and press return to search.

33 జిల్లాల తెలంగాణ‌!..రేపే అమ‌ల్లోకి కొత్త జిల్లాలు!

By:  Tupaki Desk   |   16 Feb 2019 1:18 PM GMT
33 జిల్లాల తెలంగాణ‌!..రేపే అమ‌ల్లోకి కొత్త జిల్లాలు!
X
10 జిల్లాల‌తో ఏర్పాటైన కొత్త రాష్ట్రం తెలంగాణ మూడేళ్లు తిర‌క్క‌ముందే... 31 జిల్లాల రాష్ట్రంగా అవ‌త‌రించింది. అంతేనా.. కేవ‌లం మ‌రో రెండేళ్లు కూడా నిండ‌క‌ముందే... మ‌రో అద‌న‌పు జిల్లాల‌ను ఏర్పాటు చేసుకుని 33 జిల్లాల రాష్ట్రంగా కొత్త రూపును సంత‌రించుకుంది. రేప‌టి నుంచి కొత్త‌గా ఏర్పాటు చేసిన నారాయ‌ణ‌పేట్‌ - ములుగు జిల్లాలు అమ‌ల్లోకి రానున్నాయి. ఈ మేర‌కు రేపు ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేయ‌నుంది. చిన్న రాష్ట్రాలు - చిన్న జిల్లాల‌తో స‌ర్వ‌తోముఖాభివృద్ధి సాధ్య‌మ‌న్న రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ అడుగు జాడ‌ల్లో న‌డుస్తున్నామ‌ని చెప్పుకుంటున్న కేసీఆర్‌... ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా... ఏమాత్రం వెనక‌డుగు వేయ‌లేద‌నే చెప్పాలి. 10 జిల్లాల‌ను 31 జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్న స‌మ‌యంలో వ‌చ్చిన అభ్యంత‌రాల‌ను ప‌రిష్క‌రించే విష‌యంలో త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్‌... ఇప్పుడు మ‌రో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి అభ్యంత‌రాలు రాకుండానే మంత్రాంగం నెరిపేశారు.

గ‌తేడాది డిసెంబ‌రు 31న రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు ముసాయిదా నోటికేష‌న్ జారీ చేసి ప్ర‌జ‌ల నుంచి అభ్యంత‌రాలు - స‌ల‌హాలు - సూచ‌న‌ల‌ను ప్ర‌భుత్వం స్వీక‌రించింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన అభ్యంత‌రాలు - స‌ల‌హాలు అనుస‌రించి రెండు జిల్లాల ఏర్పాటుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. ఈ రెండు జిల్లాల ఏర్పాటుకు తుది నోటిఫ‌కేష‌న్ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించింది. ఈ నెల 17 నుంచే... అంటే రేప‌టి నుంచే ఈ రెండు కొత్త జిల్లాలు మ‌నుగ‌డ‌లోకి వ‌స్తాయ‌ని అధికార‌వ‌ర్గాలు చెప్పాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఇక‌పై 33 జిల్లాల రాష్ట్రంగా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించ‌నుంద‌న్న మాట‌. అయితే ఈ నెల 19న మంచి ముహూర్తం ఉన్న నేప‌థ్యంలో ఆ రోజు నుంచి రెండు కొత్త జిల్లాల ప్ర‌స్థానం ప్రారంభ‌మ‌వుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నా... రెండు కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ సర్కారు తుది నిర్ణ‌య‌మైతే తీసేసుకుంద‌నే చెప్పాలి.