Begin typing your search above and press return to search.
తిరుమలలో అరెస్ట్ తెలంగాణ అధికారి ..ఎందుకంటే!
By: Tupaki Desk | 8 Jan 2020 11:33 AM GMTతిరుమల ప్రతినిత్యం వచ్చే లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంటుంది. నిత్యం శ్రీవారి దర్శనం కోసం సామాన్య భక్తులతో పాటుగా ..విఐపిలు - వివిఐపిలు ఎంతోమంది వస్తుంటారు. సామాన్య భక్తులకి సాధారణ దర్శనం కల్పించే టీటీడీ అధికారులు ..విఐపిలకు మాత్రం బ్రేక్ దర్శనాలకి అనుమతిస్తారు. ఇలా చాలామంది విఐపిల కేటగిరిలో శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. ఆలా వీఐపీ బ్రేక్ దర్శనానికి వచ్చి ఒక తెలంగాణ అధికారిని కొద్దిసేపటి క్రితం టీటీడీ పోలీసులు అరెస్ట్ చేసారు.
పూర్తి వివరాలు చూస్తే.. నకిలీ ఐడీ కార్డుతో తిరుమలలో వీఐపీ దర్శనం కోసం ప్రయత్నించిన తెలంగాణ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ హ్యాండ్ లూమ్స్ టెక్స్ టైల్స్ డైరెక్టర్ అయిన అరుణ్ కుమార్.. ఐపీఎస్ అధికారినంటూ తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనానికి దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-1 అధికారి అయిన ఆయన, నకిలీ ఐడీ కార్డుతో టికెట్లకు దరఖాస్తు చేశారని తెలుస్తోంది. అయితే , అనుమానం వచ్చిన టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అరుణ్ నకిలీ ఐడీ కార్డుతో టికెట్లకు దరఖాస్తు చేశారని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆయన పై చీటింగ్ కేసు నమోదు చేసి - దర్యాప్తు చేస్తున్నారు. ఆయన గతంలో మంత్రి ముకేశ్ గౌడ్ వద్ద ఓఎస్డీగా పని చేసినట్టు గుర్తించారు. శ్రీవారి దర్శనం కోసం అరుణ్ మంగళవారం తిరుమల చేరుకున్నారు. ఇకపోతే గతంలోనూ ఐఆర్ ఎస్ అధికారినంటూ తిరుమల వీఐపీ దర్శనం కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.