Begin typing your search above and press return to search.
తెలంగాణ టెన్త్ పరీక్ష ఫలితాలు విడుదల... ఇలా చేసుకోండి !
By: Tupaki Desk | 21 May 2021 9:25 AM GMTతెలంగాణ రాష్ట్రానికి చెందిన పదవ తరగతి పరీక్షా ఫలితాలని కాసేపటి క్రితం తెలంగాణా విద్యాశాఖమంత్రి సబితారెడ్డి , అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా పరీక్షలు నిర్వహించలేని నేపథ్యంలో ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ లను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పదవ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5 ,21 ,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించారు. కరోనా కారణంగా ఈ విద్యాసంవత్సరంలో కేవలం 44 రోజులు మాత్రమే పాఠశాలలు నిర్వహించారు. ఆ సమయంలో విద్యార్థులకు ఒక ఫార్మేటీవ్ అసెస్మెంట్(FA-1) పరీక్షను నిర్వహించారు. ప్రతీ సబ్జెక్టులో 20 మార్కులకు ఆ పరీక్ష నిర్వహించారు. ఈ మార్కులను ఐదింతలు పెంచి వంద మార్కులకు గానూ ఫలితాలను అధికారులు రూపొందించి విడుదల చేశారు.
ఇక పరీక్షా ఫీజు చెల్లించిన 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారు ఉన్నారు. రెగ్యులర్ గా హాజరై ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,62,917 మంది విద్యార్థులు బాలురు.. 2,53,661 మంది బాలికలు ఉన్నారు. ఇక 2 ,10,647 మంది విద్యార్థులు 10/10 జి.పి.ఎ సాధించారు. ఇక మొత్తం 535 పాఠశాలలు 10/10 జి.పి.ఎ. సాధించాయి. విద్యార్థులకు గ్రేడ్ల కేటయింపు ఇలా ఉంటుంది. మొత్తం 100 మార్కులకు గాను 91-100 మార్కులు సాధించిన వారికి A1 గ్రేడ్‌ను కేటాయించారు. 81-90 మార్కులు సాధించిన వారికి A2, 71-80 మార్కులకు B1 గ్రేడ్ కేటాయించారు. 61-70 మార్కులు వచ్చిన వారికి B2, 51-60 మార్కులకు C1 గ్రేడ్, 41-50 మార్కులకు C2, 35-40 మార్కులు సాధించిన వారికి D, 0-34 మార్కులు వస్తే ఈ గ్రేడ్‌ను కేటాయించారు. అయితే , ఈ ఏడాది దాదాపు 2 లక్షల మంది ఏ1 గ్రేడ్ సాధించినట్లు తెలుస్తోంది.
విద్యార్థులు www.bse.telangana.gov.in , http://results.bsetelangana.org/results/ వెబ్ సైట్ లలో సాయంత్రం మూడు గంటల నుంచి పొందవచ్చు. ఇందులో భాగంగా విద్యార్థులు హాల్ టికెట్ స్థానంలో తమ పేరు, పుట్టిన తేదీ, పాఠశాల పేరు నమోదు చేసి మెమోలు డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఫలితాలు ప్రకటించిన వెంటనే విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి మార్కుల మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక విద్యార్థులకు సంబంధించిన పాస్ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్.ఎస్ .సి. బోర్డుకు తెలియజేయాలని , ఆ తప్పులని బోర్డు సరిదిద్దుతుందని అన్నారు.