Begin typing your search above and press return to search.

తొమ్మిది మంది టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల

By:  Tupaki Desk   |   12 Nov 2018 7:16 PM GMT
తొమ్మిది మంది టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల
X
మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. పెద్దన్న కాంగ్రెస్ పార్టీ సోమవారం రాత్రి 65 మంది కాంగ్రెస్ అభ్యర్థులను తొలి విడుదల ప్రకటించింది. ఈ తరుణంలోనే కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూడా సీట్ల ప్రకటన చేశాయి. తాజాగా టీడీపీ తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

అనుకున్నట్టే టీడీపీ అధినేత చంద్రబాబు బావ మరిది లాబీయింగ్ పనిచేసింది.. సినీ నిర్మాత, వ్యాపారి అయిన భవ్య ఆనంద్ ప్రసాద్ కు బలమైన శేర్ లింగంపల్లి సీటు దక్కింది.

ఇక ఆశ్చర్యకర విషయం ఏంటంటే టీడీపీ తెలంగాణ అధ్యక్షుడికే టికెట్ లేకుండా పోయింది. ఎల్ రమణ ఎన్నో ఏళ్లుగా పోటీచేస్తున్న స్థానం జగిత్యాలలో కాంగ్రెస్ తరఫున టీ. జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ శాసన సభా పక్ష ఉపనేత. దాంతోపాటు బలమైన క్యాండిడేట్. అనాదిగా రమణ వర్సెస్ జీవన్ రెడ్డి ఫైట్ కొనసాగేది. కూటమి కట్టడంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2014 ఎన్నికల్లో మొత్తం 13 సీట్లలో 12 టీఆర్ఎస్ గెలిస్తే ఒక్క జగిత్యాల లో మాత్రం జీవన్ రెడ్డిని టీఆర్ఎస్ ఓడించలేకపోయింది. ఇప్పుడు జీవన్ రెడ్డిని ఓడించడానికి కవిత ఢీ అంటే ఢీ అంటోంది. అంతటి బలమైన స్థానంలో ఎల్ రమణ పోటీ నుంచి తప్పుకొని జీవన్ రెడ్డికే స్థానం ఇవ్వడం విశేషం.

*టీడీపీ ప్రకటించిన అభ్యర్థులు వీరే..

1. నామా నాగేశ్వరరావు - నామా నాగేశ్వరరావు

2. సత్తుపల్లి- సండ్రవెంకట వీరయ్య

3. అశ్వారావుపేట- మచ్చ నాగేశ్వర రావు

4. వరంగల్ పశ్చిమ - రేవూరి ప్రకాష్ రెడ్డి

5. మక్తల్ - కొత్తకోట దయాకర్ రెడ్డి

6. మహబూబ్ నగర్- ఎర్ర శేఖర్

7. ఉప్పల్ - వీరందర్ గౌడ్

8. శేరి లింగంపల్లి - భవ్య ఆనంద ప్రసాద్

9. మలక్ పేట్ - ముజాఫర్