Begin typing your search above and press return to search.
కేసీఆర్‌ను విమర్శించే ధైర్యం బాబు చేయలేడట
By: Tupaki Desk | 11 May 2017 9:29 AM GMTతెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ, భవిష్యత్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు భలే చిక్కు ప్రశ్నగా మారినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీ బలపడటం సాధ్యమయ్యే పని కాదనే అభిప్రాయానికి రావడమో లేక ముఖ్యమంత్రిగా బిజీగా ఉండిపోవడం వల్లనో కానీ ఇటీవల ఈ రాష్ట్ర రాజకీయాలపై చంద్రబాబు దృష్టిసారించడం లేదు. ఇందులో మరో పరిణామంగా త్వరలో జరగబోయే మినీ మహానాడు చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడుకు ముందు నిర్వహించే మినీ మహానాడు విషయంలో బాబు నిర్ణయంపై కొత్త చర్చ మొదలైంది.
టీటీడీపీకి చెందిన మినీ మహానాడు ఈనెల 24న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనుంది. ఇప్పటికే పలుమార్లు పార్టీ నేతలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. సుమారు పది వేల మంది ప్రతినిధులను దీనికి ఆహ్వానిస్తున్నారు. పార్టీతోపాటు అనుబంధ సంఘాల నేతలు, పార్టీ క్షేత్రస్థాయి నాయకత్వం, ప్రజాప్రతినిధులు, మండల, నియోజకవర్గ, జిల్లా రాష్ట్ర స్థాయి నేతలు, ఇతరులు రానున్నారు. దాదాపు ఎనిమిది తీర్మానాలను ప్రవేశపెట్టి దీని ద్వారా పార్టీ నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇక్కడ నేతలు చంద్రబాబును రావాలని కోరారు. అయితే చంద్రబాబు రాకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మహానాడుకు వస్తే ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ పాలనను తప్పు పట్టకుంటే ఇద్దరి మధ్య ఏదో ఉందన్న ప్రచారం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తాను మరో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి బహిరంగ విమర్శలు చేయడం శ్రేయస్కరంగా ఉండదేమో అని చంద్రబాబు అంతర్మథనంలో పడ్డట్లు సమాచారం.
అయితే తెలంగాణ నేతలను నిరాశ పర్చకుండా ఉండేందుకు చంద్రబాబు తనయుడు లోకేష్ మహానాడుకు హాజరవుతారని తెలుస్తోంది. అయితే పొరుగు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణ సర్కారు తీవ్రస్థాయిలో విమర్శలు చేసి, పార్టీ కార్యకర్తలకు ఉత్తేజం కల్పిస్తారా అనే సందేహాలు అప్పుడే మొదలయ్యాయి. మొత్తంగా మినీ మహానాడు తెలుగుదేశం పార్టీలో కొత్త చర్చకు దారితీసింది.