Begin typing your search above and press return to search.

ఈ పాద‌యాత్ర‌లేంటో.. ఈ నేత‌లేంటో.. తెలంగాణ టాక్‌!!

By:  Tupaki Desk   |   27 Feb 2023 6:00 AM GMT
ఈ పాద‌యాత్ర‌లేంటో.. ఈ నేత‌లేంటో.. తెలంగాణ టాక్‌!!
X
ఒక‌రు కాదు.. ఇద్ద‌రుకాదు.. ఏకంగా.. ముగ్గురు.. నేత‌లు పాద‌యాత్ర‌లు చేస్తున్నారు. ఇక‌, క్షేత్ర‌స్థాయిలో ని యోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర‌లు చేసేవారు కూడా ఉన్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ మొత్తంగా పాద‌యా త్ర‌ల రాష్ట్రంగా మారిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ముగ్గురు నాయ‌కుల పాద‌యాత్ర‌ల‌తో తెలంగాణ హీటెక్కింద‌నే చెప్పాలి. మ‌రోవైపు ఎన్నిక‌ల‌కు ప‌ట్టుమ‌ని ప‌దిమాసాలే స‌మ‌యం ఉండ‌డంతో ఈ యాత్ర‌ల‌పై ఆస‌క్తి కూడా పెరిగింది.

కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్‌రెడ్డి చేప‌ట్టిన హాత్ సే హాత్‌జోడో యాత్ర దూకుడుగా ముందుకు సాగుతోం ది. ప్ర‌తినియోజ‌క‌వ‌ర్గంలోనూ ఎమ్మెల్యేల వ్య‌వ‌హారానికిసంబంధించి చార్జ్‌షీట్ జారీ చేస్తున్నారు. అదేస మయంలో స్థానిక సమ‌స్య‌ల‌ను కూడా ప్ర‌స్తావిస్తున్నారు.

ఇది.. ప్ర‌జ‌ల్లోకి బాగానే పోయింది. ప్ర‌స్తుతం రేవంత్ పాద‌యాత్ర‌పై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ సాగుతోంది. మ‌రో మూడు మాసాల వ‌ర‌కు యాత్ర సాగే అవ‌కాశం ఉంది.

ఇక‌, బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జాసంగ్రామ యాత్ర కూడా విడ‌త‌ల వారీగానే సాగిన‌ప్ప‌టికీ.. ముందుకు వెళ్తోంది. ప్ర‌జ‌ల్లో ఫాలోయింగ్ కూడా ఉంది. అంద‌రూ కూడా ఆహ్వానిస్తున్నారు. ప్ర‌జా స‌మ స్య‌ల‌పైబండి బాగానే నిల‌దీస్తున్నారు.

ఒక్కొక్క సారి.. ప‌ట్టు త‌ప్పుతున్నా.. మెజారిటీ పార్ట్ అంతా కూడా.. బండి.. వ్యూహాత్మ‌కంగానే ముందుకు సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అయితే.. ఓట్లు తెస్తుందా? తేదా? అనేది ప‌క్క‌న పెడితే.. పాద‌యాత్ర అయితే సాగుతోంది.

ఇక‌, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్ష‌రాలు వైఎస్ ష‌ర్మిల కూడా దూకుడుగానే ముందుకు సాగుతున్నా రు. విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ప్ర‌తి విమ‌ర్శ‌లు చేస్తూ.. ముందుకు సాగుతున్నారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. త‌న‌కు త‌నే త‌న‌ను వివాదాల్లోకి నెట్టుకుంటున్నారు.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తూనే.. ఎక్కువ‌గా వివాదాస్ప‌ద అంశాలు.. వివాదాల‌కే ప్రాధాన్యం ఇస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటిస్తే.. ష‌ర్మిల పాద‌యాత్ర కూడా ప్ర‌జ‌ల్లో ఉంద‌నే చెప్పాలి. ఇలా.. మొత్తం తెలంగాణలో పాద‌యాత్ర‌ల జోరు జోరుగానే సాగుతోంది.