Begin typing your search above and press return to search.
దొంగలు ముదిరిపోయారు..బస్సుకే గురి
By: Tupaki Desk | 25 April 2019 9:15 AM GMTద్విచక్రవాహనాలు, కార్లు , లారీలు చోరీ చేయడం కామన్ అయిపోయింది. అందుకే ఈ దొంగలు వెరైటీగా ఆలోచించారు. ఏకంగా ఆర్టీసీ బస్సు కే గురిపెట్టారు. చాకచక్యంగా అర్ధరాత్రి బస్సునే ఎత్తుకుపోయారు. అదేదో మారుమూల ప్రాంతంలో అనుకుంటే పొరపాటే.. లక్షల మంది ఎప్పుడూ సంచరించి హైదరాబాద్ లో.. అదీ అతిపెద్ద బస్టాండ్ అయిన సీబీఎస్ లోనే.
హైదరాబాద్ లోని సీబీఎస్ బస్టాండ్ లో పార్క్ చేసిన బస్సును దొంగలు ఎత్తుకెళ్లారు. ఇది మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు. కుషాయిగూడ డిపోకు చెందిన ఈ బస్సు గౌలీగూడ టు ఈసీఐఎల్ మధ్య తిరుగుతుంటుంది. గతరాత్రి సీబీఎస్ వద్ద బస్సును పార్కింగ్ చేసి డ్రైవర్ ఇంటికెళ్లిపోయాడు. తెల్లవారి డ్యూటికి వచ్చి బస్సు కోసం చూస్తే కనిపించలేదు. దీంతో బస్సును దొంగలు ఎత్తుకెళ్లారని నిర్ధారణ అయ్యింది.
వెంటనే బస్సు డ్రైవర్ ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేశాడు. వారు బస్సు మిస్సింగ్ పై అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు ఈ బస్సు తుఫ్రాన్ వద్ద కనిపించింది. ఇక వెంటనే నేషనల్ హైవే అథారిటీని పోలీసులు అలెర్ట్ చేశారు. ఈ బస్సు రాష్ట్రం దాటి వెళ్లకుండా చర్యలు చేపట్టారు.
అయితే బస్సులో డిజీల్ కొంత వరకే ఉందని ఖచ్చితంగా డిజీల్ నింపుకోవడానికి ఏదైనా పెట్రోల్ బంక్ వద్ద ఆగే అవకాశాలున్నాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీంతో హైవేపై ఉన్న అన్ని పెట్రోల్ బంక్ లను పోలీసులు అలెర్ట్ చేశారు.
ఉమ్మడి ఏపీలో కూడా ఓ సారి బస్సు గల్లంతైన సంఘటన చోటుచేసుకుంది. 2010లో ఇదే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి ఒక బస్సును దొంగిలించారు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లోని ఒక పెట్రోల్ బంక్ వద్ద డీజీల్ అయిపోవడంతో దొంగలు బస్సును వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.