Begin typing your search above and press return to search.

తెలంగాణ లో మ్యాగీ మీద నిషేధం ఎత్తేస్తారా?

By:  Tupaki Desk   |   20 Oct 2015 4:08 AM GMT
తెలంగాణ లో మ్యాగీ మీద నిషేధం ఎత్తేస్తారా?
X
మ్యాగీకి మంచిరోజులు వచ్చేస్తున్నాయి. ఈ జూన్ లో మ్యాగీ నాణ్యత మీద పరీక్షలు నిర్వహించటం.. ప్రమాణాల ప్రకారం లేని నేపథ్యంలో దానిపై దేశ వ్యాప్తంగా నిషేధం విధించటం తెలిసిందే. బాంబే హైకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో దేశంలో కర్ణాటక.. గుజరాత్ రాష్ట్రాల్లో మ్యాగీ మీద నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో.. మ్యాగీ రీఎంట్రీ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మ్యాగీ మీద బ్యాన్ ఎత్తివేస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. మ్యాగీ ఉత్పత్తులకు తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్కెట్ ఉంది. ప్రభుత్వ వర్గాల సమాచారం చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మ్యాగీ మీద బ్యాన్ స్టేటస్ కో మొయింటైన్ అవుతుందని చెబుతున్నారు.

అయితే.. మ్యాగీ మీద నిషేధం ఎత్తేసే విషయంపై ఏపీ కంటే తెలంగాణ ప్రభుత్వం ముందుగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. రానున్న ఒకట్రెండు రోజుల్లో మ్యాగీ మీద బ్యాన్ ఎత్తేసే దిశగా అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన తర్వాత.. మ్యాగీ మీద ఏపీ సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చూస్తుంటే.. తెలుగు రాష్ట్రాల్లో మ్యాగీ మీద బ్యాన్ మొదట తెలంగాణలోనే ఎత్తేస్తే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.