Begin typing your search above and press return to search.

ఆ 31 సీట్ల‌లో ఎవ‌రు ఎక్కువ గెలిస్తే... తెలంగాణ `సీఎం` వాళ్లే!

By:  Tupaki Desk   |   17 Feb 2022 3:30 PM GMT
ఆ 31 సీట్ల‌లో ఎవ‌రు ఎక్కువ గెలిస్తే... తెలంగాణ `సీఎం` వాళ్లే!
X
రాజ‌కీయాలు చాలా చిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటాయో ..కూడా చెప్ప‌లేని ప‌రి స్థితి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ‌లోనూ రాజ‌కీయాలు ఇలానే ఉన్నాయి. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాలు గా ఉన్న ఒక‌ప్ప‌టి అగ్ర‌వ‌ర్ణాల కంటే.. ఇప్పుడు.. సంఖ్యా ప‌రంగా చూసుకుంటే.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అల్ప సంఖ్యాక వ‌ర్గాల డామినేష‌న్ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీసీలు, ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకుకు ప్రాధాన్యం పెరిగిపోయింది. ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా.. ప్ర‌భుత్వాల పార్టీలు, విప‌క్షాలు కూడా ఈ కోణంలోనే ఎక్కువ‌గా ఆలోచిస్తున్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కు.. తెలంగాణను తీసుకుంటే.. ముఖ్య‌మంత్రి సీటు కోసం కొట్లాడుకునే.. ఇక్క‌డి పార్టీల‌కు ఒక 31 స్థానాలు అత్యంత కీల‌కంగా మారిపోయాయి. అంటే.. మొత్తం 119 స్థానాల్లో ఈ 31 సీట్ల‌లో పాగా వేసే పార్టీనే.. అధికారంలోకి వ‌స్తుంద‌నే విధంగా ప‌రిస్థితి మారిపోయింది.

2023లో ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టి నుంచే ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ‌లు,స‌ర్వేలు సాగుతున్నాయి. ముఖ్యంగా వ్యూహాత్మ‌క వ్య‌వ‌హారాల్లో ఫ‌స్ట్ ఉండే.. మాట‌ల మాంత్రికుడు.. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఈ సారి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌ని పెట్టుకుంటున్నార‌నే వార్త‌.. పెద్ద ఎత్తున చర్చ‌నీయాంశంగా మారిపోయింది.

ఈ ప‌రిణామాన్ని.. కొంచెం ఆలోచించాల్సిందేన‌ని అంటున్నారు మేధావులు. ఇక‌, తెలంగాణ‌లో మొత్తం 119 అసెంబ్లీ స్థాన‌నాలు ఉంటే.. వాటిలో  ఎస్టీ 12, ఎస్సీ 19 స్థాన‌నాలు ఉన్నాయి. అంటే. మొత్తం 31 . ఈ 31 స్థానాల్లో ఎవ‌రు ఎక్కువ ద‌క్కించుకుంటే.. వారే రాబోయే ముఖ్య‌మంత్రి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ స్థానాల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంద‌ని.. అంటున్నారు. అదేస‌మ‌యంలో అధికార టీఆర్ ఎస్ కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టు ఉంద‌ని చ‌ర్చ సాగుతోంది.  అయితే.. మ‌రో ప్ర‌ధాన పార్టీ అధికారంలోకి వ‌స్తామ‌ని.. ఢంకా ప‌థంగా చెబుతున్న పార్టీ బీజేపీ.

ఈ పార్టీ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే..ఈ 31లో ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో కూడా వారికి అనుకూలంగా లేదు అని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే అధికార టీఆర్ ఎస్ పార్టీ.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌పై పెద్ద ఎత్తున దృష్టి పెట్టింద‌నే వాద‌న వినిపిస్తోంది.

దీంతో నే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాటిలో పెద్ద ఎత్తున ర‌క‌ర‌కాలుగా స‌ర్వేలు చేయించుకుంటున్నార‌ని.. తెలుస్తోంది. ఈ 31 స్థానాల్లో ఎవ‌రికి ఎక్కువ సీట్లు ద‌క్కుతాయి.. అనేవిష‌యంపై స్థానిక నేత‌ల‌తోనూ.. ఆయ‌న చ‌ర్చిస్తున్నారట‌. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాలు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అత్యంత కీల‌కంగా మారుతున్నాయ‌ని... అంటున్నారు ప‌రిశీల‌కులు కూడా! మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.