Begin typing your search above and press return to search.
88753 51555కు మిస్డ్ కాల్ ఇస్తే.. ఇంటికే పండ్లు
By: Tupaki Desk | 21 April 2020 5:10 AM GMTకరోనా వేళ.. లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొన్ని పథకాలకు విశేష ఆదరణ లభిస్తుంది. ఆ కోవకే చెందింది.. ఒక్క మిస్డ్ కాల్ తో ఇంటి ముంగిటకు పండ్లు తెప్పించుకునే ప్రోగ్రాం. తెలంగాణ ప్రభుత్వం.. వాక్ ఫర్ వాటర్ సంస్థ కలిసి డిజైన్ చేసిన ఈ పథకం ప్రజలకు మేలు చేయటంతో పాటు.. తాజా పండ్లను ఇంటికి తక్కువ ధరకు అందించేలా డిజైన్ చేశారు.
88753 51555 నెంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే.. రూ.300లకే ఆరు రకాల పండ్లు ప్యాక్ చేసి ఇంటికి డెలివరీ చేయనున్నారు. ఈ బ్యాగులో కేజీన్నర మామిడి.. మూడు కేజీల బొప్పాయి.. నాలుగు కేజీల పుచ్చకాయ.. రెండున్నర కేజీల బత్తాయి.. కిలో సపోటా తో పాటు డజను నిమ్మకాయలు ఉండటం గమనార్హం. సూపర్ మార్కెట్లలో కానీ.. బయట కొంటే.. ఇంతకంటే ఎక్కువ ధర చెల్లించాల్సిన వేళ.. అందుకు భిన్నంగా తక్కువ ధరకే తాజా పండ్లను ఇంటికే తెచ్చిచ్చే ఈ ప్రోగ్రామ్ కు సానుకూల స్పందన లభిస్తోంది.
ఈ పండ్ల బ్యాగులు ముప్ఫైకి మించితే ఉచితం గా డోర్ డెలివరీ ఇస్తామని చెబుతున్నారు. ఆర్డర్ చేసిన 72 గంటల్లో డెలివరీ ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ 30బ్యాగులు ఆర్డర్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే? అన్న సందేహానికి సమాధానం ఇస్తున్నారు. ఒక సంచికైనా సరే దూరాన్ని బట్టి ఒక్కో దానికి మినిమం రూ.15 నుంచి మ్యాగ్జిమం రూ.30 వరకూ వసూలు చేస్తామని చెబుతున్నారు. లాక్ డౌన్ వేళ.. 88753 51555 నెంబరును సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.