Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: సమత కేసులో ముగ్గురికి ఉరిశిక్ష

By:  Tupaki Desk   |   30 Jan 2020 8:17 AM GMT
బ్రేకింగ్: సమత కేసులో ముగ్గురికి ఉరిశిక్ష
X
మారుమూల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆడకూతురుపై అత్యాచారం చేసి హతమార్చిన నిందితులకు కఠిన శిక్ష పడింది. సమతపై గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం సంచలన తీర్పును ఇచ్చింది.

ఈ మేరకు కోర్టు సమతపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ముద్దాయిలైన ఏ1 షేక్ బాబు, ఏ2 షాబుద్దీన్, ఏ3 షేక్ ముగ్దుమ్ లకు ఉరిశిక్షను విధిస్తూ చారిత్రక తీర్పును వెలువరించింది.

గత ఏడాది నవంబర్ 24న ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని కుమరం భీం జిల్లా ఎల్లాపటార్ సమీపంలో ముగ్గురు కామాంధులు రోడ్డు పక్క పొదల్లొకి తీసుకెళ్లి సమతపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు పొక్కితే డేంజర్ అని భావించిన ముగ్గురు నిందితులు సమతను దారుణంగా హత్యచేశారు.

దిశ ఘటనకు మూడు రోజుల ముందే సమత ఘటన చోటుచేసుకున్నా పెద్దగా స్పందన రాలేదు. అయితే అక్కడి కుమరం జిల్లా వాసులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ప్రభుత్వం, పోలీసులు స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వేగంగా విచారణ జరిపి సత్వర న్యాయం చేశారు.

మొత్తం 140 పేజీల చార్జీషిట్ లో మృతురాలి చీరపై ఉన్న వీర్యం ఆధారంగా నిందితులను గుర్తించినట్టు పోలీసులు చార్జీషీట్లో పేర్కొన్నారు. కోర్టుకు ఆధారాలు సమర్పించడంతో ముగ్గురికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.