Begin typing your search above and press return to search.
అమరావతికి చెక్ పెట్టేందుకే.. ట్విన్ టవర్స్?
By: Tupaki Desk | 26 July 2015 4:55 AM GMTకలిసి ఉన్నంత వరకూ ఒక పద్ధతి. కానీ.. ఉమ్మడి కుటుంబం కాస్తా.. ముక్కలై.. ఎవరి గొడవ వాళ్లదన్నట్లుగా వాటాలు పంచేసుకొని.. విడిపోయిన తర్వాత.. ఆ కుటుంబాల మధ్య పోటీ అనివార్యం అవుతోంది.
విడిపోయిన కుటుంబాలన్నీ బాగు పడే ఛాన్స్ ఉండదు. కలిసి ఉన్నప్పుడు కవర్ అయిపోయిన లోపాలు.. విడిపోయిన తర్వాత బయటకు వస్తాయి. అంతేకాదు.. అప్పటివరకూ అండగా ఉన్న వారు కాస్తా.. పోటీ దారులుగా మారతారు. ఇది మనిషి మనస్తత్వం. ఒక కుటుంబం ముక్కలైపోతేనే ఇలాంటి పరిణామాలెన్నో చోటు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు.. ఒక రాష్ట్రం రెండు ముక్కలు అయినప్పుడు మరెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పాల్సిన అవసరం లేదు.
గత కొద్ది రోజులుగా అమరావతి మాస్టర్ ప్లాన్ కు సంబంధించి వార్తలు మీడియా సంస్థలు ఉదరగొటేస్తున్నాయి. దాదాపు 35 ఏళ్ల పాటు సాగే అమరావతి రాజధాని నిర్మాణం ఇప్పుడేదో మొదలై.. వెనువెంటనే పూర్తయ్యే మాదిరి భారీ ప్రచారం.. కట్టబోయే అమరావతి గురించి నిత్యం ఏదో ఒక గొప్పలు చెబుతూ కథనాలు రావటం తెలిసిందే.
ఇలాంటి కథనాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను బాగానే డిస్ట్రబ్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఇందుకు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కొంతమేర బలం చేకూరేలా ఉన్నాయి. కాళోజీ జయంతి సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. విడిపోయిన తర్వాత ఎవరి బతుకు వాళ్లం బతుకుదామని చెబుతూ.. ఏపీ రాజధానికి సంబంధించిన వార్తలు తెలంగాణలోనూ తెగ అచ్చేస్తున్నారంటూ మండి పడ్డారు.
ఏపీకి చెందిన రాజధాని నిర్మాణం వార్తలు.. మాస్టర్ ప్లాన్ తెలంగాణలో అచ్చేయాలా అంటూ ప్రశ్నించారు కూడా. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ సర్కారు ట్విన్ టవర్స్ ను నిర్మిస్తున్నట్లుగా ప్రకటించింది. హైదరాబాద్ కు తలమానికంగా ఉండే ఈ ట్విన్ టవర్స్ కు సంబంధించిన డిజైన్లను ప్రపంచవ్యాప్తంగా 15 ప్రముఖ కంపెనీలు తయారు చేసిన నమూనాల్ని పరిశీలించి.. చివరకు ఒక దానికి ఓకే చెప్పేసినట్లుగా చెబుతున్నారు.
ఏపీ రాజధాని వ్యవహారంలో.. సీడ్ క్యాపిటల్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ 2018 నాటికి పూర్తి చేయాలన్న కృత నిశ్చయంతో ఏపీ సర్కారు ఉంది. ఒకవేళ తాను అనుకున్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి సీడ్ క్యాపిటల్ ను నిర్మిస్తే.. దాని ప్రభావం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉండటం ఖాయం. అందుకే.. అమరావతి నిర్మాణాలకు చెక్ పెట్టేందుకు తాజా ట్విన్ టవర్స్ గా చెబుతున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ గా పిలవననున్న ఈ ట్విన్ టవర్స్ లో ఒకటి 24 అంతస్థులు కాగా.. మరొకటి 16అంతస్తులుగా చెబుతున్నారు. ఈ రెండు భారీ భవనాల మధ్య వంతెన లాంటిది ఉంటుందని.. రాకపోకలకు అనువుగా ఉంటుందని చెబుతున్నారు.
అంతేకాదు.. టవర్ల మీద హెలిప్యాడ్ కూడా ఉంటుందని చెబుతున్నారు. హైదరాబాద్ సిటీకి ఒక ఐకాన్ గా మారే ఈ ట్విన్ టవర్స్ నిర్మాణ బాధ్యతల్ని డీసీపీ అనురాగ్ శర్మ.. సీపీ మహేందర్ రెడ్డిలు పర్యవేక్షించాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి చెక్ పెట్టేలా.. అక్కడ కట్టే కట్టడాలకు తలదన్నేలా హైదరాబాద్ లో కొంగొత్త నిర్మాణాలను చేపట్టాలన్న భావనలో తెలంగాణ సీఎం ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ ఆటలో ఎవరు ముందుంటారో కాలమే సమాధానం చెప్పాలి.