Begin typing your search above and press return to search.

నవంబర్ లో ఎంత మందు తాగారో తెలుసా ?.. రికార్డు బ్రేక్

By:  Tupaki Desk   |   3 Dec 2020 8:15 AM GMT
నవంబర్ లో ఎంత మందు తాగారో తెలుసా ?.. రికార్డు బ్రేక్
X
తెలంగాణా ఏర్పడిన దగ్గర నుండి మొన్నటి నవంబర్ నెల ఓ విషయంలో రికార్డు సృష్టించింది. ఎందులో అంటే మందు తాగటంలో. అవును మీరు చదివింది నిజమే. నవంబర్ నెలలో రికార్డు స్ధాయిలో రాష్ట్రం మొత్తంమీద రూ. 2567 కోట్ల విలువైమ మద్యాన్ని తాగేశారు. మామూలుగా సగటున నెలకు రూ. 1700 కోట్ల దాకా మద్యం అమ్ముడు పోతుంటుంది. అయితే నవంబర్ లో మాత్రం మద్యం ప్రియులు దుమ్ము దులిపేశారు.

ఒక్క నవంబర్ నెలలోనే ఇన్ని వందల కోట్ల రూపాయల మద్యాన్ని ఎందుకు ఎక్కువగా తాగేశారు ? పోయిన నెలలో ఏకంగా రూ. 900 కోట్ల అదనపు మద్యాన్ని కొనుగోలు చేసేశారు. కారణం ఏమిటంటే గ్రేటర్ ఎన్నికలు జరగటమే అని సమాధానం లభిస్తోంది. నవంబర్ 26వ తేదీన రూ. 229 కోట్లు, 27న రూ. 367 కోట్లు, 28న రూ. 284 కోట్ల మద్యాన్ని కొనుకున్నారు. మరి మూడు రోజుల్లో రూ. 881 కోట్ల విలువైన మద్యాన్ని కొనుగోలు చేశారంటే గ్రేటర్ ఎన్నికల మహత్యం కాక మరేముంటుంది ?

గ్రేటర్ ఎన్నికల పుణ్యమా అని కొనుక్కున్న వాళ్ళకు కొనుక్కున్నంత తాగినోళ్ళకు తాగినంత అన్నట్లుగా జరిగిపోయింది నవంబర్ నెల. నవంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీలోగా 31,60135 లిక్కర్ కేసుల లాగించేశారు మద్యం ప్రియులు. ఇక బీర్ల విషయానికి వస్తే నవంబర్ నెలలో 23 లక్షల 85, 597 కేసుల బీర్లను లాగించేశారు.

నవంబర్ నెల మొత్తం మీద అమ్ముడుపోయిన మొత్తం రూ. 2567 కోట్ల విలువైన మద్యంలో 26, 27, 28 తేదీల్లో మాత్రమే రూ. 860 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయిందంటే మందుబాబులో ఏ స్ధాయిలో లాగించేశారో అర్ధమైపోతోంది. మరి ఇంత భారీ మొత్తంలో మద్యం ప్రియులు తాగేసినాక ఇక పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లేయమంటే ఎలా వేస్తారు చెప్పండి...