Begin typing your search above and press return to search.
తెలంగాణ సచివాలయం అప్పుడే సినిమాల్లో...!
By: Tupaki Desk | 11 May 2023 4:00 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అత్యంత వేగంగా నిర్మాణం చేయించిన సచివాలయం ఇటీవల ప్రారంభం అయిన విషయం తెల్సిందే. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు అన్ని కూడా ఇప్పుడు సచివాలయం నుంచి విధులు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.
గతంలో సచివాలయంకు వెళ్లేందుకు ఆసక్తి చూపించని ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా కొత్త సచివాలయంకు వెళ్తున్న విషయం కూడా తెల్సిందే. మొత్తానికి గత కొన్ని రోజులుగా ప్రతి రోజు వార్తల్లో నిలుస్తున్న కొత్త సచివాలయం టీవీల్లో కనిపిస్తూ వస్తుంది. తాజాగా వెండి తెరపై కూడా తెలంగాణ సచివాలయం కనిపించింది.
సచివాలయం ప్రారంభం కు ముందే గోపీచంద్ సినిమా 'రామబాణం' సినిమాలోని కొన్ని షాట్స్ ను అక్కడ షూట్ చేయడం జరిగింది. హీరో గోపీచంద్ కనిపించే ఆ షాట్స్ బ్యాక్ గ్రౌండ్ లో తెలంగాణ సచివాలయం.. నెక్లెస్ రోడ్ మరియు ట్యాంక్ బండ్ ను చూపించడం జరిగింది.
రామబాణం షూటింగ్ సమయానికి సచివాలయం పూర్తి అయ్యి ఉండదు. అయినా కూడా చాలా అందంగా అద్భుతంగా సినిమాలో కనిపిస్తుంది అంటూ సినిమాను చూసిన తెలంగాణ ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ముందు ముందు తెలంగాణ సచివాలయం ఎన్నో వందల సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది. అయితే మొదట రామబాణం సినిమాలో కనిపించింది అంటూ ఎప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోతుంది.
గోపీచంద్ హీరోగా డింపుల్ హయతీ హీరోయిన్ గా రూపొందిన రామబాణం సినిమా కి శ్రీవాస్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామబాణం సినిమా నిరాశ పరిచింది.