Begin typing your search above and press return to search.
కేసీఆర్ కొత్త కొర్రీలు.. మారనున్న సచివాలయ డిజైన్
By: Tupaki Desk | 20 July 2020 5:42 PM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలల పంటగా అభివర్ణించే సచివాలయాన్ని ఎట్టకేలకు కూల్చేస్తున్న వైనం తెలిసిందే. కోర్టు చిక్కుల నుంచి కూల్చివేయటమే ఇప్పుడున్న పనిగా చెబుతున్నారు. భారీ ఎత్తున నిర్మించాలని భావిస్తున్న కొత్త సచివాలయానికి సంబంధించిన డిజైన్ ను ఈ మధ్యనే ఓకే చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. తాను ఓకే చేసిన డిజైన్ లో కొన్ని కొర్రీల్ని కేసీఆర్ పెట్టినట్లుగా చెబుతున్నారు.
సచివాలయాన్ని కూల్చివేత మొదలైన వెంటనే కొత్త సచివాలయ డిజైన్ ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ.. ఒక ప్రకటనను ఫోటోను విడుదల చేశారు. అయితే.. ఆ డిజైన్ లో కొన్ని మార్పులు తప్పనిసరిగా చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమోదం పొందిన డిజైన్ తెలంగాణలోని రెండు రాజభవనాల్ని పోలి ఉండటం.. ఆ విషయం బయటకు రావటంతో.. మరింత కసరత్తు చేయాలని భావించారు.ఈ క్రమంలో కొన్ని కీలక మార్పులు చేసినట్లుగా చెబుతున్నారు.
దీనికి సంబంధించిన సమీక్షను రేపు (మంగళవారం) చేయనున్నట్లు చెబుతున్నారు. బాహ్యరూపంలో మార్పులతో పాటు.. సచివాలయం లోపల ఏమేం సౌకర్యాలు ఉండాలన్న విషయాన్ని చర్చిస్తారు. అనంతరం ఈ డిజైన్ ను మంత్రివర్గంలో ఆమోదించనున్నారు. టెండర్లు పిలిచి.. నిర్మాణాన్ని షురూ చేయనున్నారు. తాజా రివ్యూలో మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు.. ఆర్ అండ్ బీ అధికారులు.. ఇంజనీరింగ్ నిపుణులు.. తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్టులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.