Begin typing your search above and press return to search.

ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ.. హైకోర్టుకు హక్కు లేదు: ఎస్ఈసీ పీటీషన్

By:  Tupaki Desk   |   4 Dec 2020 7:29 AM GMT
ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ.. హైకోర్టుకు హక్కు లేదు: ఎస్ఈసీ పీటీషన్
X
నిన్న రాత్రి ఎస్ఈసీ ఉత్తర్వులు ఇవ్వడం.. తెల్లవారి దాన్ని హైకోర్టు కొట్టివేయడం.. అప్పటికే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి కావడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ గందరగోళంలో పడిపోయాయి.

నిన్న రాత్రి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వస్తిక్ గుర్తు ఓట్లపై లేకున్నా.. పెన్నుతో టిక్ చేసినా కూడా ఓటుగానే పరిగణించాలని ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై బీజేపీ హైకోర్టుకు ఎక్కగా.. తాజాగా స్వస్తిక్ గుర్తు ఉంటే ఓటు అని తీర్పునిచ్చింది. ఇప్పటికే ఎస్ఈసీ ఆదేశాల మేరకు కౌంటింగ్ పూర్తయ్యింది. బీజేపీకే పోస్టల్ బ్యాలెట్ లో మెజార్టీ వచ్చింది. స్వస్తిక్ గుర్తు లేని వాటిని కూడా లెక్కించారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో మళ్లీ లెక్కిస్తారా? అదే కొనసాగిస్తారా అన్నది గందరగోళంగా మారింది.

దీనిపై తాజాగా ఎస్ఈసీ హైకోర్టుకు ఎక్కారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.. రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్ర హోదాలో పని చేస్తుందని.. దీని అధికారాల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సరికాదనే విషయాన్ని గుర్తు చేస్తోంది.

ఈ విషయాన్నే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం ఉదయం ఇచ్చిన తీర్పును హైకోర్టు పునః పరిశీలించాలని ఎస్ఈసీ కోరింది. దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.