Begin typing your search above and press return to search.

వైరస్ విలయతాండవం ..తెలంగాణలో ఒక్క రోజే 169 కేసులు !

By:  Tupaki Desk   |   30 May 2020 5:45 AM GMT
వైరస్ విలయతాండవం ..తెలంగాణలో ఒక్క రోజే 169 కేసులు !
X
తెలంగాణ రాష్ట్రంలో వైరస్ రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. శుక్రవారం కొత్తగా రాష్ట్రంలో మొత్తం రికార్డు లెవ‌ల్ లో 169 వైరస్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసులలో అత్యధికంగా జిహెచ్ ఎం సి పరిధిలోనే నమోదయ్యాయి. జీహెచ్ ఎం సీ పరిధిలో అత్య‌ధికంగా 82 కేసులు ఉండ‌గా, రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు కేసుల చొప్పున న‌మోద‌య్యాయి. అంతేకాక, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 64 కొత్త కేసులను శుక్రవారమే గుర్తించడం గ‌మనార్హం.

ఒక ఒక్కరోజే మరో నలుగురు కరోనాతో చనిపోయినట్లుగా వైద్య‌,ఆరోగ్య‌శాక అధికారులు బులెటిన్‌ లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం వైరస్ మరణాల సంఖ్య 71కి చేరింది. ఇక ఇప్పటి వరకూ 1381మంది వ్యాధి న‌యమై వివిధ ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసులు చూస్తే 2425 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 973 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఏపీలో చాలా రోజుల తరువాత వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 11,638 శాంపిల్స్‌ను పరీక్షించగా 33 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 2874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 2037 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా...60 మంది మరణించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 777 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక దేశవ్యాప్తంగా వైరస్ కేసుల ని చూస్తే 1,73,491 మంది ఇప్పటి వరకు వైరస్ బారిన పడ్డారు. అలాగే , 4,980 మంది ఈ వైరస్ భారిన పడి మరణించారు. మహారాష్ట్రంలో వైరస్ కేసులు ఏ మాత్రం తగ్గటం లేదు. దేశంలోనే అత్యధికంగా ఈ రాష్ట్రంలో వైరస్ కేసులు నమోదు అవుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 2682 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో మొత్తం మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 62,228కి చేరింది. ఇది మహారాష్ట్ర ప్రజల్ని మాత్రమే కాకుండా భారత దేశాన్ని కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న అంశం.