Begin typing your search above and press return to search.
రిపబ్లిక్ డేకు ముందే తెగించడానికి సిద్దమైన ముష్కరులు !
By: Tupaki Desk | 23 Jan 2020 6:12 AM GMTనవీబ్ బాబు ప్రస్తుతం దక్షిణ, మధ్య కశ్మీర్ కు హిజ్బుల్ ముజాహిద్దీన్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ లో రియాజ్ నైకూ తర్వాతి స్థానం నవీద్ బాబుదే. కశ్మీర్ లో పౌరుల హత్య కు సంబంధించి, భద్రతా దళాల నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లే సమయంలో పోలీసులను కూడా హతమార్చారనే అభియోగాలను కూడా ఎదుర్కొంటున్నాడు. జాదూరా, నివా-ఫొఖేపొర రహదారిలో దాడులకు సంబంధించి నవీద్ బాబు తన సహచరులకు ఐఈడీ బాంబులను అందజేసినట్టు డీఐఏ తెలిపింది.
జమ్ముకశ్మీర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కు చెందిన నవీద్ బాబు కశ్మీర్‌లో దాడులకు ప్రణాళిక రచించినట్టు తెలిసింది. రిపబ్లిక్ డే కి ముందే కశ్మీర్ లోని జాదూరా, నివా-ఫొఖేపొర వద్ద ఐఈడీ బాంబు పేల్చి అలజడి సృష్టించాలనుకొన్నాడని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ భద్రతా సంస్థలకు తెలిపినట్టు తెలుస్తుంది. ఇకపోతే , నవీద్ బాబు తన సహచరులతో మాట్లాడిన వివరాలను ఈ నెల 15వ తేదీన సేకరించినట్టు తెలిపింది. జనవరి 11వ తేదీన డీఎస్పీ దవిందర్ సింగ్, నవీద్ బాబు సహా మరొ ఇద్దరిని కారులో ఢిల్లీ తరలిస్తూ అరెస్టైన సంగతి తెలిసిందే.
నవీద్ బాబు, సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీ తరలిస్తోన్న డీఎస్పీ దవిందర్ సింగ్ ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు నవీద్ బాబు తో ఇదివరకు ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా ఎన్ఐఏ విచారిస్తోంది. బుధవారం దవిందర్ సింగ్ ఇంట్లో ఎన్ఐఏ టీం సోదాలు కూడా నిర్వహిచింది. కొన్ని డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకుంది. అంతేకాదు దవిందర్ సింగ్ అరెస్టయ్యే ముందు విధులు నిర్వర్తించిన శ్రీనగర్ ఎయిర్‌పోర్టు సీసీటీవీ ఫుటీజీని కూడా పరిశీలించారు.
సింగ్ యాంటీ హైజాకింగ్ యూనిట్ విభాగంలో పనిచేస్తూ.. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులను ప్రవేశించేందుకు సాయం చేశారా అనే కోణంలో పరిశీలించారు. శ్రీనగర్, కాజికండ్, కుల్గాం జిల్లాలో కూడా విచారణ చేపట్టామని మరో అధికారి తెలిపారు. దవిందర్ సింగ్ ఇతరులతో మాట్లాడిన సంభాషణలు కూడా పరిశీలిస్తున్నామని.. ఉగ్రవాదులకు సున్నితమైన సమాచారం అందజేశారనే కోణంలో పరిశీలించినట్టు తెలిపారు. గతేడాది దవిందర్ సింగ్ పనిచేసిన చోట కూడా ఎవరెవరితో మాట్లాడారు..? ఉగ్రవాదులతో లింక్ ఉన్న వారు ఉన్నారా అనే అంశాలపై కూడా ఆరాతీస్తున్నట్టు అధికారులు తెలిపారు.