Begin typing your search above and press return to search.
సంచలన స్టేట్ మెంట్ ఇచ్చిన తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్
By: Tupaki Desk | 8 Aug 2020 4:30 PM GMTఅంతకంతకూ పెరగటమే కానీ.. తగ్గటం అన్నది తెలీనట్లుగా సాగుతున్నకోవిడ్ -19కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఇలాంటి మాటలుఏదైనా చెప్పాల్సి వస్తే.. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి కానీ.. లేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ చెప్పే అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా.. సీనియర్ వైద్యాధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇంతకూ ఆయనేం చెప్పారంటారా? అక్కడికే వస్తున్నాం.
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ తగ్గుతున్నాయని.. ఈ నెలాఖరుకు నగరంలో కేసుల సంఖ్య భారీగా తగ్గుతాయని అంచనా వేసినట్లు చెబుతున్నారు. సెప్టెంబరు చివరి నాటికి తెలంగాణలో కరోనా పూర్తిగా తగ్గే అవకాశం ఉందని చెప్పారు. కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందన్న ఆయన.. ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అధికంగా ఫీజులు వసూలు చేశాయన్నారు. వీటికి సంబంధించి పలు ఫిర్యాదులు తమకు అందినట్లుగా చెప్పారు.
ఇప్పటివరకు తమకు1039 ఫిర్యాదులు వచ్చాయని.. వాటిల్లో 130కిపైగా బిల్లులకు సంబంధించిన ఫిర్యాదులే ఉన్నాయన్నారు. బీమాకు సంబంధించి పదహారుఫిర్యాదులు వచ్చాయని.. తమకు అందిన ఫిర్యాదుల్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రులందరికికౌన్సెలింగ్ ఇస్తున్నట్లు చెప్పిన ఆయన.. ప్రైవేటుఆసుపత్రుల్ని మూసి వేయటం తమ విధానం కాదన్నారు. ఈ విషయాలన్నిపక్కన పెట్టి.. సెప్టెంబరు నెలాఖరుకు కేసులు ఎలా తగ్గే అవకాశం ఉంది? హెల్త్ ఇమ్యునిటీ పెరిగిందా? కోవిడ్ -19 బలహీన పడిందా? లాంటి సందేహాలకు సమాధానం ఇస్తే మరింత బాగుండేది కదా?అయినా.. మరో రెండు నెలల్లో కరోనాను కంట్రోల్ చేసే పరిస్థితి తెలంగాణలో ఉంటే.. అలాంటి సమాచారం ముఖ్యమంత్రి కేసీఆర్ నోట్లో నుంచి ఎందుకు రానట్లు చెప్మా?