Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో తాజాగా 178 పాజిటివ్‌, ఆరుగురు మృత్యువాత‌

By:  Tupaki Desk   |   9 Jun 2020 4:34 PM GMT
తెలంగాణ‌లో తాజాగా 178 పాజిటివ్‌, ఆరుగురు మృత్యువాత‌
X
మ‌ళ్లీ తెలంగాణలో మ‌హ‌మ్మారి వైర‌స్ విజృంభిస్తోంది. ఒక్క‌రోజే వంద‌లోపు న‌మోదైన కేసులు తాజాగా మంగళవారం ఒక్కరోజే 178 పాజిటివ్‌ నమోదయ్యాయి. ఈ క్ర‌మంలోనే 24 గంట‌ల్లో ఆరుగురు మృతి చెందారు. ఈ తాజా కేసుల‌తో క‌లిపి ఇప్పటివరకు మొత్తం కేసులు 3,920కి చేరాయని మంగ‌ళ‌వారం వైద్యారోగ్య శాఖ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టివ‌ర‌కు వైర‌స్‌తో పోరాడుతూ మృతిచెందిన వారి సంఖ్య 148కి చేరింది.

ఈ తాజా కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలోనే 143, రంగారెడ్డిలో 15, మేడ్చల్‌లో 10, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌లో 2 చొప్పున‌, జగిత్యాల, కుమ్రం భీం, సిరిసిల్ల, వరంగల్‌ రూరల్‌లో ఒక్కో కేసు నమోదైంది. ఇప్పటివరకు 1,742 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 2,030 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో వైర‌స్ వ్యాప్తి తీవ్ర‌మ‌వ‌డంతో ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ఉన్న‌త అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సంబంధిత అధికారుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల ప‌రిధిలో వైర‌స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌లపై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా వైర‌స్ క‌ట్ట‌డిపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు ఎలా స‌మాధాన‌మివ్వాలో కూడా చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా జ‌ర్న‌లిస్ట్ మ‌నోజ్ కుమార్‌కు గాంధీ ఆస్ప‌త్రిలో స‌క్ర‌మంగా వైద్యం అందించ‌లేద‌ని అంశంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యం కూడా చ‌ర్చ‌లోకి వ‌చ్చిన‌ట్లు తెలిసింది.