Begin typing your search above and press return to search.
షర్మిలకు ఇగో పెరిగిందా?
By: Tupaki Desk | 7 Nov 2022 3:30 PMమునుగోడు ఫలితాలపై తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టిన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. కేవలం 10వేల ఓట్ల మెజార్టీతో గెలిచింది ఓ గెలుపేనా? అని టీఆర్ఎస్ ను ఎద్దేవా చేశారు. 'ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి.. హత్య చేసి గెలిచామని సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి కదా?' అంటూ ఒక మహిళ మాట్లాడకూడని పదజాలాలు అన్నీ మాట్లాడేశారు. పైగా 'సిగ్గుండాలి కదా కేసీఆర్ గారు..?' అంటూ విరుచుకుపడ్డారు.
ఇక బీజేపీని ఏమీ అనడం లేదని ఇన్నాళ్లు అందరూ షర్మిలను టార్గెట్ చేశారు. ఆమె బీజేపీకి భయపడుతోందని.. అందుకే నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఈసారి బీజేపీపై కూడా షర్మిల నోరు లేచింది. 'కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొని, ఉప ఎన్నిక తెచ్చిన బీజేపీకి నైతికత గురించి మాట్లాడే హక్కులేదు. దొంగదారి రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరు బుద్ది వచ్చిందా?' అంటూ టీఆర్ఎస్, బీజేపీలపై ట్విట్టర్ లో షర్మిల మండిపడ్డారు.
షర్మిల ట్వీట్ వ్యాఖ్యలపై ఇప్పుడు కొందరు నేతలు కౌంటర్ ఇస్తున్నారు. 'షర్మిలకు ఇగో బాగా పెరిగిందని.. ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదని ఇలా నోరుపారేసుకుంటోందని అంటున్నారు. ఒక పార్టీ గెలుపును, ఓటమిని కూడా విమర్శించే నాయకురాలు తన బ్యాక్ గ్రౌండ్ మరిచి మాట్లాడుతోందని అంటున్నారు.
ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఒకసారి ఎంపీగా కేవలం 5 వేల ఓట్లతో గెలిచారు. వాళ్ల నాయనమ్మ ఒకసారి పంచాయతీలో వార్డ్ మెంబర్ గా ఓడిపోయారు. మునుగోడులో కేఏ పాల్ ఓడిపోతానని తెలిసి కూడా నిలబడ్డాడు. కనీసం షర్మిల పార్టీ మునుగోడులో పోటీచేసే ధైర్యం కూడా చేయలేకపోయింది. ఇలా ఎన్నో ఉదాహరణాలు ఉన్నాయి. అంతదాకా ఎందుకు షర్మిల అన్న జగన్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1 శాతం ఓట్లతో ఓడిపోయాడు.
ఇవన్నీ తెలియకనా ఇగోతో షర్మిల మాట్లాడుతోందని.. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమని.. అలాంటి వాటిని స్వీకరించని ఈమె ఒక నేతనా? అని అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం ఎన్నికల్లో పోటీచేయడానికి ధైర్యం లేని షర్మిలనా మాట్లాడేది అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
ముందు పోటీచేసి చూపించి ఆ తర్వాత దమ్ముంటే మాట్లాడాలని.. 2024 ఎన్నికల్లో మీ పనితనం ఏంటో జనాలు చూస్తారంటూ కౌంటర్ ఇస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.