Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో బయట పడ్డ మరో భారీ సెక్స్ రాకెట్ !

By:  Tupaki Desk   |   30 Dec 2019 8:46 AM GMT
హైదరాబాద్ లో బయట పడ్డ మరో భారీ సెక్స్ రాకెట్ !
X
హైదరాబాద్ లో మరో సెక్స్ రాకెట్ గుట్టు ని పోలీసులు రట్టు చేసారు. హైదరాబాద్ నగర శివారులో కొద్దిరోజులుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోన్న ఈ సెక్స్ రాకెట్ బండారాన్ని ఎట్టకేలకి పోలీసులు బయట పెట్టారు. ముంబై తో పాటు ఇతర ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను రప్పించి , వ్యభిచారం చేయిస్తున్న ముఠాని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్వాహకుడితో పాటు ఆరుగురు సెక్స్‌ వర్కర్లు, నలుగురు విటులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

పూర్తి వివరాలు చూస్తే ... రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని కాటేదాన్‌ ప్రాంతంలో రాజస్థాన్‌ కు చెందిన దీపక్ అనే వ్యక్తికొన్ని రోజులుగా జీవనం కొనసాగిస్తున్నాడు. కష్టపడకుండా, సులభమైన పద్దతి లో డబ్బు సంపాదించాలన్న ఆశతో వ్యభిచారం చేయడం ప్రారంభించాడు. ఉప్పర్‌పల్లిలోని సన్‌ రైజ్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసకుని అమ్మాయిలతో వ్యాపారం చేయడం ప్రారంభించాడు. ముంబై నుంచి అందమైన యువతులను రప్పించి గుట్టుగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడు.

ఆ ఇంట్లోకి ప్రతి రోజు పదుల సంఖ్యలో యువకులు వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కొద్దిరోజులుగా పోలీసులు ఆ ఇంటి పై నిఘా పెట్టి వ్యభిచారం జరుగుతోందని నిర్ధారించారు. ఆదివారం రాత్రి ఆ ఇంటిపై రైడ్ చేసి ఆరుగురు సెక్స్‌వర్కర్లను రక్షించారు. దీపక్‌ తో పాటు నలుగురు విటులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. ఇటీవల హైదరాబాద్‌లో ఇటీవల వ్యభిచార ముఠాల కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు అడపాదడపా కొన్నింటిని గుర్తించి పట్టుకుంటున్నా.. నిర్వాహకులు ఏమాత్రం తగ్గడం లేదు.